ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆపరేషన్ వజ్ర... బీహార్‌లో అంతర్-రాష్ట్ర నకిలీ మందుల నెట్‌వర్క్‌ను ఛేదించిన సీబీఎన్


సూత్రధారి అరెస్టు

प्रविष्टि तिथि: 01 AUG 2026 9:19PM by PIB Hyderabad

సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్మధ్యప్రదేశ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆపరేషన్ వజ్ర’లో భాగంగాబీహార్‌లోని గయామసౌరీ (పాట్నా)లో నకిలీ మందులను నిల్వ చేసిన గోదాములనుఒక అక్రమ తయారీ కేంద్రాన్ని అధికారులు గుర్తించారునిందితులు వీటిని మాదక ద్రవ్యాలుఇతర నకిలీ మందులను అక్రమంగా తయారు చేయడానికినిల్వ చేయడానికి ఉపయోగిస్తున్నారు.

2025లో నమోదైన నేరాల దర్యాప్తులో ఇది మరో కీలక పురోగతివిస్తృతమైన తదుపరి దశ ఆపరేషన్ ఫలితంగా బీహార్‌లోని గయాలో నాలుగు అక్రమ గోదాములను అధికారులు గుర్తించారుఈ ఘటనలో 68,200 ట్రమడాల్ మాత్రలు59,000 ఇతర మాత్రలు52,542 కోడైన్ సిరప్ సీసాలనూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నిరంతర దర్యాప్తుసాంకేతికమానవ’ నిఘా సమాచారం ఆధారంగా2026 జూలై 22న ప్రధాన నిందితుడిని సీబీఎన్ విజయవంతంగా అరెస్టు చేసిందిఈ అరెస్టు ద్వారా లభించిన కీలకమైన ఆధారాలతోవిస్తృతమైన తదుపరి దశ ఆపరేషన్‌కు మార్గం సుగమమైంది.

2026 జూలై 16 - 27 తేదీల మధ్యనీమచ్‌లోని సీబీఎన్ ఎంపీ యూనిట్ నిరోధక విభాగం బీహార్ వ్యాప్తంగా విస్తృత నిఘాక్షేత్రస్థాయి కార్యకలాపాలను నిర్వహించిందిపరారీలో ఉన్న నిందితుడు గయాలోని ఖంజాహన్‌పూర్ ప్రాంతంలో అక్రమంగా తయారు చేసిన మాదక ద్రవ్యాలుఇతర నకిలీ మందులను నిల్వ చేయడానికి అక్రమ గోదాములను తిరిగి ప్రారంభించినట్లు దర్యాప్తులో వెల్లడైందిఅతని కదలికలపై పలు రోజుల పాటు రహస్యంగా నిఘా ఉంచిన సీబీఎన్ బృందంఅతడిని విజయవంతంగా అదుపులోకి తీసుకుంది.

నిందితులు వెల్లడించిన సమాచారం ఆధారంగాసీబీఎన్ బృందం రెండు రిజిస్టర్ కానిఅనధికారిక గోదాముల్లో సోదాలు నిర్వహించిందిఈ సందర్భంగా అనధికారికంగా తయారు చేసిన 21,373 బ్యూప్రెనార్ఫిన్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుందిక్లావమ్-625పాన్-40బెటాడిన్ ఆయింట్‌మెంట్అజిత్రాల్అనేక ఇతర ఔషధాల తయారీ సహా భారీ పరిమాణంలో నకిలీకల్తీ నాన్-ఎన్‌డిపిఎస్ మందులనూ ఈ సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్నారు.

స్థానిక పోలీసుల సహాయంతో నిర్వహించిన తదుపరి దశ దాడుల్లోనగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మరో ఆరు అనుమతి లేనిఅనధికార గోదాములనూ గుర్తించారుఈ ప్రాంగణాల నుంచి గణనీయ పరిమాణంలో నకిలీఅనధికారికంగా నిల్వ ఉంచిన నాన్-ఎన్‌డిపిఎస్ మందులను స్వాధీనం చేసుకున్నారుస్వాధీనం చేసుకున్న సరుకునుసీల్ చేసిన గోదాములను తదుపరి చట్టపరమైన చర్యల కోసం బీహార్ రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగానికి అప్పగించారు.

సీబీఎన్ అందించిన సమాచారం ఆధారంగారాష్ట్ర ఔషధ విభాగం అక్రమ గోదాముల నుంచి కింద పేర్కొన్న పరిమాణంలో నాన్-ఎన్‌డిపిఎస్ నకిలీ మందులను స్వాధీనం చేసుకుంది:

 మాత్రలు/క్యాప్సూల్స్ – 4,39,774

ఇంజెక్షన్స్/వెయిల్స్/ఆంపుల్స్ – 1,895

సిరప్స్/బాటిల్స్ – 3,811

ఇతర ఔషధ తయారీలు (లోషన్స్/ట్యూబ్స్/డ్రాప్స్మొదలైనవి.) – 3,490

ఇంతకుముందు అరెస్టయిన తన సహచరుల్లో ఒకరు పాట్నాలోని మసౌరీ సమీపంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో అక్రమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారనీ... అక్కడ బ్యూప్రెనార్ఫిన్ఇతర మాదక ద్రవ్యాల అక్రమ తయారీకి యంత్రాలుపరికరాలను ఉపయోగిస్తున్నారనీ సుదీర్ఘ విచారణలో నిందితులు వెల్లడించారుఈ సమాచారంపై వెంటనే స్పందించిన సీబీఎన్ బృందం... స్థానిక పోలీసులురాష్ట్ర మాదక ద్రవ్యాల విభాగంఆహార విభాగాల అధికారుల సహాయంతో ఆ ప్రాంగణంలో సంయుక్తంగా సోదాలు నిర్వహించిందిఈ సోదాల్లో వివిధ తయారీ యంత్రాలుపరికరాలురసాయనాలుకృత్రిమ రుచికారకాలనూ స్వాధీనం చేసుకున్నారుమొత్తం అక్రమ తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేసిఎన్‌డిపిఎస్ చట్టం- 1985 నిబంధనల ప్రకారం అన్ని యంత్రాలుపరికరాలుసంబంధిత సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ సిండికేట్ అనుసరించిన మోసపూరిత పద్ధతినీ దర్యాప్తు బృందం వెల్లడించిందినిందితులు అద్దె ఒప్పందాలు చేసుకోకుండానే తక్కువ అద్దెకు లభించే ఆవరణలను అద్దెకు తీసుకున్నారుఎలాంటి డిజిటల్ ఆధారాలు లేకుండా ఉండేందుకు అద్దె చెల్లింపులనూ నగదు రూపంలో చేశారుచట్టాన్ని అమలు చేసే సంస్థల నుంచి తప్పించుకోవడానికి నకిలీ గుర్తింపు పత్రాల ద్వారా పొందిన మొబైల్ కనెక్షన్లను వారు ఉపయోగించారు.

ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలోసీబీఎన్ ఎంపీ యూనిట్ అక్రమ ప్రయోగశాలలపై దాడులు సహా మొత్తం 90 కేసులు నమోదు చేసిందిఇప్పటివరకు 121 మంది అనుమానితులనూ అరెస్టు చేసిందివ్యవస్థీకృత మాదకద్రవ్యాల అక్రమ రవాణా సిండికేట్‌లను నిర్మూలించడం... మాదకద్రవ్యాలు-సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ తయారీనిల్వరవాణాలో పాలుపంచుకున్న వారిపై చట్టాన్ని కఠినంగా అమలు చేయడం... దేశంలో మాదకద్రవ్యాల సురక్షిత వినియోగాన్ని నిర్ధారించడం పట్ల తమ అచంచల నిబద్ధతను సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్పునరుద్ఘాటిస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2293244) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , हिन्दी