ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహిళల 70 కేజీల బాక్సింగ్‌లో స్వర్ణం గెలుచుకున్న అరుంధతి చౌదరిని అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 AUG 2026 12:57AM by PIB Hyderabad

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు-2026 మహిళల 70 కేజీల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న అరుంధతి చౌదరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

అరుంధతి చౌదరి తన అద్భుతమైన విజయంతో చరిత్ర సృష్టించారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆమె అసమాన క్రీడా నైపుణ్యాన్నిఅచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారని ప్రధానమంత్రి ప్రశంసించారు.

రాబోయే సంవత్సరాల్లో ఆమె మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించిన శ్రీ మోదీ... ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌-2026 మహిళల 70 కేజీల బాక్సింగ్ ఈవెంట్‌లో అద్భుతమైన ఆటతీరుతో స్వర్ణం సాధించి అరుంధతి చౌదరి చరిత్ర సృష్టించారుఆమె తన అసమాన క్రీడా నైపుణ్యాన్నిఅచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారుఆమెకు అభినందనలురాబోయే సంవత్సరాల్లో ఆమె మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా.
 




************


MJPS/SS/ST


(రిలీజ్ ఐడి: 2293242) సందర్శకుల సూచీ సంఖ్య : : 53