రైల్వే మంత్రిత్వ శాఖ
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్-సావంత్‌వాడీ రోడ్ మధ్య కొత్త రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం
మహారాష్ట్రలో రైలు అనుసంధానాన్ని మెరుగుపరచనున్న 510 కిలోమీటర్ల రోజువారీ ఎక్స్‌ప్రెస్..
ముంబై, థానే, పన్వేల్, రత్నగిరి, సింధుదుర్గ్‌తో పాటు కొంకణ్ తీరంలోని ఇతర ముఖ్య స్టేషన్లకు ప్రత్యక్ష అనుసంధానం
ఈ కొత్త సర్వీసుతో కొంకణ్ ప్రాంతంలో రైలు అనుసంధానం బలోపేతం.. పర్యాటకం, వ్యాపారం, విద్య, ప్రాంతీయ రవాణాకు ఊతం
प्रविष्टि तिथि:
01 AUG 2026 1:29PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంత ప్రయాణికులకు భారతీయ రైల్వే తీపి కబురు అందించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (ముంబై)-సావంత్‌వాడీ రోడ్ మధ్య కొత్త రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించడానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. 510 కిలోమీటర్ల సుదీర్ఘ మార్గంలో నడిచే ఈ రైలు ద్వారా పర్యాటకం, విద్య, ఉపాధి, వ్యాపార, సామాజిక అవసరాల కోసం ప్రయాణించే వేలాది మందికి నేరుగా, సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ సదుపాయం లభించనుంది.
ఈ కొత్త సర్వీస్ రైలు నంబర్ 15087 (ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్-సావంత్‌వాడీ రోడ్ ఎక్స్‌ప్రెస్), రైలు నంబర్ 15088 (సావంత్‌వాడీ రోడ్-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్)గా ప్రతిరోజూ అందుబాటులో ఉండనుంది.
కొంకణ్ ప్రాంతంలో విస్తృతమైన రైలు అనుసంధానం
ఈ కొత్త రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికుల సౌకర్యార్థం మార్గమధ్యంలో పలు కీలక స్టేషన్లలో ఆగనుంది.
· దాదర్
· థానే
· పన్వెల్
· పెన్
· రోహా
· మాంగావ్
· వీర్
· ఖేడ్
· చిప్లూన్
· సావర్దా
· ఆరావళి రోడ్
· సంగమేశ్వర్ రోడ్
· రత్నగిరి
· ఆడవలి
· వాలివాడే
· రాజాపూర్ రోడ్
· వైభవ్వాడి రోడ్
· నందగావ్ రోడ్
· కంకవ్లి
· సింధుదుర్గ్
· కుడల్
· సావంత్‌వాడీ రోడ్
ఈ కొత్త రైలు ముంబై మహానగర ప్రాంతానికి, కొంకణ్ తీర ప్రాంతంలోని ముఖ్యమైన పట్టణాలు, జిల్లాలకు నిరాటంకమైన అనుసంధానాన్ని అందిస్తుంది. దీనివల్ల ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుంది.
పర్యాటక రంగానికి, ఆర్థిక వ్యవస్థకు, ప్రయాణీకుల సౌకర్యానికి ఊతం
ఈ కొత్త సర్వీసు ప్రారంభంతో ముంబై, దక్షిణ కొంకణ్ మధ్య రైలు అనుసంధానం బలపడుతుంది. దీనివల్ల అక్కడ ఉన్న అందమైన సముద్ర తీరాలు, చారిత్రక కోటలు, ప్రముఖ ఆలయాలు, పర్యావరణ పర్యాటక ప్రదేశౠలను సందర్శించే పర్యాటకులకు ప్రయాణం చాలా తేలికవుతుంది. రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారులు, చిన్న తరహా వ్యాపారులు, స్థానిక ప్రజలకు ముంబై-కొంకణ్ మధ్య అదనపు ప్రత్యక్ష రైలు మార్గాన్ని అందిస్తుంది.
కొంకణ్ మార్గంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా తీసుకొచ్చిన ఈ సర్వీస్.. ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి ఊతమిస్తూ, ప్రయాణ సమయాన్ని నివారించి ప్రయాణికులకు పూర్తి సౌకర్యాన్ని కలిగిస్తుంది.
ఈ కొత్త రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ప్రయాణికుల అనుసంధానాన్ని విస్తరించడం, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడం, సులభతరమైన రవాణా ద్వారా సమాన ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడుతూ భారతీయ రైల్వేకు ఉన్న నిరంతర కట్టుబాటును ప్రతిబింబిస్తోంది.
(रिलीज़ आईडी: 2293127)
आगंतुक पटल : 6