రక్షణ మంత్రిత్వ శాఖ
ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎయిర్ మార్షల్ తేజ్‌పాల్ సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
01 AUG 2026 3:57PM by PIB Hyderabad
ఎయిర్ మార్షల్ తేజ్‌పాల్ సింగ్ ఏవీఎస్ఎం వీఎం ఈ రోజు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన వీర యోధులకు నివాళులర్పించారు.
1990 జూన్ 16న ఫైటర్ పైలట్‌గా నియమితులైన ఎయిర్ మార్షల్‌కు 3500 గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉంది. ఆయన క్యాట్ ఎ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్, ఎక్స్‌పెరిమెంటల్ టెస్ట్ పైలట్. ఎయిర్ మార్షల్ భారత వైమానిక దళంలో కీలకమైన కార్యాచరణ, కమాండ్, సిబ్బంది నియామకాలకు సంబంధించిన వివిధ పదవులను నిర్వహించారు.
తన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఎయిర్ మార్షల్... గౌరవ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జనవరి 2011లో వాయు సేన పతకాన్ని, జనవరి 2021లో అతి విశిష్ట సేవా పతకాన్ని అందుకున్నారు.
దేశానికి 39 సంవత్సరాల పాటు ఘనమైన, విశిష్టమైన సేవలందించి, 31 జూలై 2026న పదవీ విరమణ చేసిన ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి ఎస్‌వైఎస్ఎం ఏవీఎస్ఎం వీఎం స్థానంలో ఎయిర్ మార్షల్ తేజ్‌పాల్ సింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
(రిలీజ్ ఐడి: 2293121)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8