రైల్వే మంత్రిత్వ శాఖ
దక్షిణ మధ్య రైల్వేలోని వాడి - రాయచూర్ సెక్షన్‌లో రూ.220 కోట్ల విద్యుత్ మార్గం ఆధునికీకరణ ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం
అధిక రద్దీ కలిగిన నెట్‌వర్క్ లో 2×25 కేవీ విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థతో 102 రూట్ కిలోమీటర్ల వాడి - రాయచూర్ సెక్షన్ ఆధునికీకరణ
प्रविष्टि तिथि:
30 JUL 2026 6:36PM by PIB Hyderabad
రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతం, అధిక రద్దీ కలిగిన మార్గాల్లో సామర్థ్యాన్ని పెంచే దిశగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వాడి - రాయచూర్ సెక్షన్‌లో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను 1×25 కేవీ నుంచి 2×25 కేవీకి ఆధునీకరించేందుకు రూ. 220 కోట్ల ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ 102 రూట్ కిలోమీటర్ల (204 ట్రాక్ కిలోమీటర్ల) డబుల్ లైన్ సెక్షన్‌ను కవర్ చేస్తుంది. కీలకమైన రైలు కారిడార్లలో విద్యుత్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి భారతీయ రైల్వేలు చేపడుతున్న నిరంతర ప్రయత్నాలలో ఇది ఒక భాగం.
అప్‌గ్రేడ్ చేయనున్న ఈ ట్రాక్షన్ వ్యవస్థ రైల్వే ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, రైల్వే నెట్‌వర్క్‌లోని కీలక మార్గాల్లో ఒకటైన ఈ విభాగంలో పెరుగుతున్న రైలు రాకపోకల అవసరాలను సమర్థంగా తీర్చేందుకు తోడ్పడుతుంది. వాడి - రాయచూర్ సెక్షన్ ముంబై - పుణె - వాడి - రాయచూర్ - గుంతకల్ - కడప - రేణిగుంట –చెన్నైలను అనుసంధానించే (హై డెన్సిటీ నెట్‌వర్క్ - హెచ్డీఎన్) రూట్–7లో భాగంగా ఉంది.
2×25 కేవీ విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను అమలు చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న విద్యుత్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయి. ఈ మార్గంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికులు, సరుకు రవాణా రైళ్ల రాకపోకలను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ ఆధునికీకరణతో నిర్వహణ సామర్థ్యం మెరుగుపడటంతో పాటు, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ రైల్వే కారిడార్‌లో రైళ్లను మరింత విశ్వసనీయంగా, అంతరాయం లేకుండా నడిపేందుకు దోహదపడుతుంది.
దేశవ్యాప్తంగా అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాల్లో సామర్థ్యాన్ని పెంపొందిస్తూ, కీలక మౌలిక సదుపాయాలను ఆధునికీకరించేందుకు భారతీయ రైల్వే చేపడుతున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు ఆమోదం ద్వారా కీలక రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణ సామర్థ్యాల పెంపు, ప్రయాణికుల, సరుకు రవాణా వినియోగదారుల అవసరాలను తీర్చగల ఆధునిక, విశ్వసనీయ, భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉండే రైల్వే నెట్‌వర్క్ నిర్మాణం పట్ల భారతీయ రైల్వే నిబద్ధత మరోసారి స్పష్టమైంది.
***
(रिलीज़ आईडी: 2292142)
आगंतुक पटल : 11