గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గిరిజన వర్గాల తరలింపుపై కేంద్రం స్పష్టీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 30 JUL 2026 1:38PM by PIB Hyderabad

షెడ్యూల్డ్ తెగలుఇతర సంప్రదాయ అటవీ వాసుల (అటవీ హక్కుల గుర్తింపు-ఎఫ్ఆర్ఏచట్టం 2006 కింద గిరిజన హక్కులకు సంబంధించిన సమస్యలపై ఉత్తరాఖండ్హిమాచల్ ప్రదేశ్ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వన గుజ్జర్ వర్గాల నుంచి అందిన వినతి పత్రాలను పరిశీలించినట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే వెల్లడించారునేడు లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలను తెలిపారుఅటవీ హక్కుల చట్టం అమలు బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోనే ఉంటుందని అందుకే ఆయా వినతిపత్రాలను పరిశీలన నిమిత్తం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకుజిల్లా యంత్రాంగాలకు పంపినట్లు మంత్రి స్పష్టం చేశారుఎఫ్ఆర్ఏ చట్ట నిబంధనలుఇతర సంబంధిత చట్టాలకు అనుగుణంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.

అటవీ హక్కుల చట్టం (ఎఫ్ఆర్ఏనిబంధనలను కచ్చితంగా పాటించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనుకేంద్రపాలిత ప్రాంతాలను కోరుతోందిఈ చట్టం అమలు పురోగతిని సమీక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోందిఅటవీ హక్కుల చట్టం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి మంత్రిత్వ శాఖకు వచ్చే ఫిర్యాదులువిజ్ఞప్తులను సంబంధిత రాష్ట్రాలకుకేంద్రపాలిత ప్రాంతాలకు వెంటనే పంపుతారున్యాయంగా దక్కాల్సిన అటవీ హక్కులు అర్హులైన లబ్ధిదారులకు ఖచ్చితంగా అందేలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశం.

ఎఫ్ఆర్ఏ చట్టం ప్రకారం నిర్ణీత ప్రక్రియను పక్కాగా పాటించేలా చూడటానికి సబ్ డివిజనల్ స్థాయి కమిటీ (ఎస్‌డీఎల్‌సీ), జిల్లా స్థాయి కమిటీ (డీఎల్‌సీసభ్యులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందిఇందుకోసం అవసరమైన శిక్షణ మెటీరియల్‌నుసమాచార కరపత్రాలను రాష్ట్రకేంద్రపాలిత ప్రభుత్వాలకు క్రమం తప్పకుండా పంపుతోందిఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్రపాలిత ప్రాంతాలు తమ అధికారుల సామర్థ్య పెంపు చర్యలనువిస్తృత శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2291918) సందర్శకుల సూచీ సంఖ్య : : 31
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil