సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
జలాంతర సాంస్కృతిక వారసత్వం
प्रविष्टि तिथि:
30 JUL 2026 3:44PM by PIB Hyderabad
భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) పరిధిలోని జలాంతర పురావస్తు విభాగం ప్రస్తుతం ద్వారక-బేట్ ద్వారక (గుజరాత్), మహాబలిపురం (తమిళనాడు), కారైకల్ (పుదుచ్చేరి) ప్రాంతాల్లో పరిశోధన-అన్వేషణ కార్యకలాపాలు చేపట్టింది.
మరోవైపు తమిళనాడులోని పూంపుహార్ వద్ద ఇదే తరహా కార్యకలాపాల కోసం ఆ రాష్ట్ర పురావస్తు శాఖ కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ జారీ చేసింది. అలాగే, గుజరాత్‌లోని బేట్ ద్వారక, ఛారి, గంగాట బేట్ వద్ద జలాంతర తవ్వకాలు-అన్వేషణకు నిమిత్తం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ పరిధిలోని మెరైన్ ఆర్కియాలజీ సెంటర్‌కు లైసెన్సు ఇచ్చింది.
ఏఎస్‌ఐ పరిధిలోని జలాంతర పురావస్తు విభాగం బడ్జెట్ వివరాలు కిందివిధంగా ఉన్నాయి:
|
సంవత్సరం
|
కేటాయింపు (రూ.లలో)
|
వ్యయం (రూ.లలో)
|
|
2025-26
|
75,40,000/-
|
74,91,064/-
|
|
2026-27
|
66,50,000/-
|
25,63,894/-
|
ఇక తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖకు భూ ఉపరితల, జలాంతర పురావస్తు తవ్వకాల కోసం రూ.7 కోట్లతోపాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి రూ.20 లక్షలు వంతున నిధులు కేటాయించింది.
ఈ నేపథ్యంలో పురావస్తు శాస్త్రవేత్తలకు శిక్షణనివ్వడం సహా నీటిలో మునిగి ఉన్న ప్రదేశాలపై సర్వే నిర్వహణ కోసం ఏఎస్‌ఐ పరిధిలోని జలాంతర పురావస్తు విభాగం ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దేశంలో 2030 దాకా జలాంతర అన్వేషణ/తవ్వకాలకు కింది ప్రదేశాలను ఎంపిక చేశారు:
· ద్వారక, బేట్ ద్వారక (గుజరాత్)
· విజయ దుర్గ్ (మహారాష్ట్ర)
· జంజీరా (మహారాష్ట్ర)
· కారైకల్ (పుదుచ్చేరి)
· మహాబలిపురం (తమిళనాడు)
కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ నేడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా జవాబిస్తూ ఈ వివరాలు తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2291911)
आगंतुक पटल : 8