నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎంకేవీవై ద్వారా ఉపాధికల్పన

प्रविष्टि तिथि: 29 JUL 2026 4:22PM by PIB Hyderabad

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవైప్రస్తుత వెర్షను.. పీఎంకేవీవై 4.0..ను 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అమలుచేస్తున్నారుఈ పథకంలో భాగంగాశిక్షణను పొందిన అభ్యర్థులకు వివిధ కెరియర్ మార్గాల్ని ఎంపిక చేసుకొనేలా సాధికారతను సమకూరుస్తారువారికి ఆన్-జాబ్ ట్రయినింగ్ (ఓజేటీపద్ధతిలో పరిశ్రమకు సంబంధించిన నైపుణ్య ఆధారిత పాఠ్యక్రమాలను బోధించి సమర్థులుగా తీర్చిదిద్దడం ఈ పథకం ఉద్దేశం.

నాణ్యతనీజవాబుదారీతనాన్నీ నిర్ధారించడానికి పీఎంకేవీవైని తరచుగా అంచనా వేస్తోందిఈ మధ్యేకేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు చెందిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన ‘అరుణ్ జైట్లీ జాతీయ ఆర్థిక సంస్థ’ (ఏజేఎన్ఐఎఫ్ఎమ్) ‘పీఎంకేవీవై 4.0’పై స్వతంత్ర తృతీయ పక్షం పరిశీలనను చేపట్టిందిఈ ప్రక్రియను అస్సాం రాష్ట్రంతో పాటు దేశమంతటా పూర్తి చేశారుస్వల్ప కాలిక శిక్షణను (ఎస్‌టీటీపొందిన అభ్యర్థులకు ఉపాధికల్పన అవకాశాలను చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపరిచే దిశగా పీఎంకేవీవై తోడ్పడినట్లు నివేదికలో పేర్కొన్నారుఉపాధిని పొందినస్వయంఉపాధికి మొగ్గు చూపిన ఎస్‌టీటీ అభ్యర్థులు పీఎంకేవీవై శిక్షణను పొందక ముందు 26.6 శాతంగా ఉంటేశిక్షణను తీసుకున్న తరువాత 45.4 శాతానికి చేరారుఅంటే వీరి విషయంలో 18.8 శాతం వృద్ధి నమోదైందిఆదాయానికి సంబంధించిన ఫలితాలు కూడా సానుకూలంగా ఉన్నాయిశిక్షణ పూర్తి చేసిధ్రువపత్రాలను అందుకున్న తరువాత 41.4 శాతం ఎస్‌టీటీ అభ్యర్థులతో పాటు 48.9 శాతం రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్ (ఆర్‌పీఎల్అభ్యర్థులు తమ ఆదాయాన్ని పెంచుకున్నట్లు తేలింది.

కేంద్ర నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామికత్వం (ఎమ్ఎస్‌డీఈశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదాశ్రీ జయంత్ చౌధరీ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.

 

***


(रिलीज़ आईडी: 2291285) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी