సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగం

प्रविष्टि तिथि: 29 JUL 2026 3:31PM by PIB Hyderabad

భారత్‌లో సివిల్ సర్వీసుల సామర్థ్య పెంపు కోసం చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అయిన మిషన్ కర్మయోగి.. సివిల్ సర్వెంట్లను భవిష్యత్తు సవాళ్లకు సమర్థవంతంగా సిద్ధం చేయడానికి అవసరమైన నైపుణ్యాలను అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకుందిదీనిలో సివిల్ సర్వీసుల విభాగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ సాంకేతికతలలో సామర్థ్యాన్ని పెంచడానికి.. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రంగంలో అవసరమైన నైపుణ్యాలువిజ్ఞానాన్ని అందించి వారిని సాధికారులుగా రూపొందించడానికి అధిక ప్రాధాన్యత లభిస్తోందిప్రస్తుతం ఐగాట్ (ఐజీఓటీకర్మయోగి వేదికలో కేంద్రంతో పాటు రాష్ట్రకేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖలువిభాగాలుసంస్థల నుంచి 1.70 కోట్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు నమోదు చేసుకున్నారుప్రభుత్వ అధికారులకు అవసరమైన డిజిటల్ పరిజ్ఞానంనైపుణ్యాలను అందించడానికి ఈ వేదికలో కృత్రిమ మేధస్సువర్ధమాన సాంకేతికతలపై 218 కోర్సులు అందుబాటులో ఉన్నాయిఐగాట్ వేదికలో ఈ ఏఐకొత్త సాంకేతికతల కోర్సులను అభ్యాసకులు ఇప్పటివరకు 3.3 కోట్లకు పైగా విజయవంతంగా పూర్తి చేశారుడిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం- 2023, డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నిబంధనలు- 2025లు.. 2025 నవంబర్ 13న నోటిఫై అయ్యాయివ్యక్తిగత డేటాను చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం సదరు వ్యక్తి నుంచి ఒత్తిడి లేకుండానిర్దిష్టసమాచార సహితనిబంధనలు లేనిస్పష్టమైన అనుమతితో మాత్రమే ప్రాసెస్ చేసేలా ఇవి నిర్ధారిస్తాయిసిధి లోక్‌సభ నియోజకవర్గంలో ఏఐని పాలనాపరంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి ఎలాంటి ప్రయోగాత్మక పరిశీలన నిర్వహించలేదుఐగాట్ కర్మయోగి వేదికలో అందుబాటులో ఉన్న ఏఐఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతల కోర్సులన్నీ సిధి నియోజకవర్గంలోని ఉద్యోగులతో సహా వేదికలో నమోదైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ అందుబాటులో ఉంటాయి.

ఈ సమాచారాన్ని కార్మికప్రజా ఫిర్యాదులుపింఛన్ల మంత్రిత్వ శాఖప్రధాని కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు లోక్‌సభలో ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2291283) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil