వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పురుగు మందుల నిర్వహణ బిల్లు

प्रविष्टि तिथि: 28 JUL 2026 6:19PM by PIB Hyderabad

ప్రస్తుత అవసరాలు, 'జన్ విశ్వాస్ చట్టం'కు అనుగుణంగా... కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 'పురుగు మందుల నిర్వహణ బిల్లు-2026'ను రూపొందించింది.

పురుగు మందుల నిర్వహణ బిల్లు ముసాయిదాను అభిప్రాయ సేకరణ కోసం 30.12.2025న అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు పంపిణీ చేశారు. పురుగు మందుల తయారీదారులు, డీలర్లు/రిటైలర్లు సహా సాధారణ ప్రజలు, సంబంధిత వాటాదారుల అభిప్రాయాలను ఆహ్వానిస్తూ, దానిని 07.01.2026న ప్రజలందరికీ అందుబాటులో ఉంచారు. డేటా రక్షణ సహా పురుగు మందుల నిర్వహణ, నియంత్రణకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలు/విభాగాలు, పురుగుమందుల తయారీదారుల సంఘాలు, పురుగు మందుల డీలర్లు, పురుగు మందుల తయారీదారులు, రైతులు, ఎన్‌జీవోలు మొదలైన వారి నుంచి పెద్ద సంఖ్యలో సూచనలు/అభిప్రాయాలు అందాయి.

ఈ సమాచారాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ ఈ రోజు లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలియజేశారు.

 

***


(रिलीज़ आईडी: 2290849) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी