నౌకారవాణా మంత్రిత్వ శాఖ
తీరప్రాంత సరకు రవాణా ప్రోత్సాహక పథకం
प्रविष्टि तिथि:
28 JUL 2026 4:39PM by PIB Hyderabad
అంతర్గత జలమార్గాలు, తీరప్రాంత నౌకా రవాణా వాటాను ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 2047 నాటికి 12 శాతానికి పెంచే లక్ష్యంతో తీరప్రాంత సరుకు రవాణా ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్ర బడ్జెట్ 2026లో ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకం రూపకల్పన దశలో ఉంది.
తీరప్రాంత నౌకా రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ఓడరేవులు, నౌకా, జల రవాణా మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలను చురుకుగా అమలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కింద పేర్కొన్న చర్యలు తీసుకున్నారు.
తీరప్రాంత సరుకు రవాణా నౌకలకు పోర్టు ఛార్జీలపై (నౌక, సరుకు సంబంధిత రుసుములపై) 40 శాతం రాయితీ కల్పిస్తున్నారు.
తీరప్రాంత నౌకల తిరుగు సమయాన్ని (టర్న్అరౌండ్ టైమ్) తగ్గించి, వాటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రాధాన్య బెర్తింగ్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.
భారత జెండా కలిగిన నౌకలు వినియోగించే బంకర్ ఇంధనంపై జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
పోర్టుల వద్ద తీరప్రాంత సరుకును వేగంగా తరలించేందుకు ‘గ్రీన్ ఛానల్ క్లియరెన్స్’ వ్యవస్థను ప్రవేశపెట్టారు.
తీరప్రాంత నౌకా రవాణాను ప్రోత్సహించేందుకు తీరప్రాంత షిప్పింగ్ చట్టం, 2025 )ను రూపొందించారు.
రో-రో, రో-పాక్స్, ప్రయాణీకుల ఫెర్రీ సేవలను ప్రోత్సహించడం కోసం సాగరమాల పథకం కింద ఆర్థిక సహాయం అందించడానికి ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ 30 మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులకు మంజూరు ఇచ్చింది. వీటిలో రూ. 739 కోట్ల విలువైన 18 ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
పూర్తయిన ప్రాజెక్టుల విషయానికి వస్తే, ఉదాహరణకు గుజరాత్ లోని ఘోఘా-హజీరా మార్గంలో నడిచే రో-పాక్స్ ఫెర్రీ - రోడ్డు ద్వారా పట్టే 12 గంటల ప్రయాణ సమయాన్ని సముద్ర మార్గం ద్వారా 4 గంటలకు తగ్గిస్తుంది. మహారాష్ట్రలోని ముంబై-మాండ్వా మార్గంలో నడిచే రో-పాక్స్ ఫెర్రీ - రోడ్డు మార్గాన ఆలీబాగ్ చేరుకోవడానికి పట్టే 4 గంటల సమయాన్ని సముద్ర మార్గం ద్వారా కేవలం గంటకు తగ్గిస్తుంది.
రో-పాక్స్, ప్రయాణీకుల ఫెర్రీ సేవలు 65 లక్షలకు పైగా ప్రయాణీకులకు, 15 లక్షలకు పైగా వాహనాలు, కార్గో మోసుకెళ్ళే ట్రక్కులకు ప్రయోజనం చేకూర్చాయి.
తీరప్రాంత కార్గో నౌకలకు పోర్ట్ ఛార్జీలలో (నౌక, కార్గో ఆధారిత ఛార్జీలు) 40% మినహాయింపు కల్పించారు.
10 ప్రధాన ఓడరేవులలో ప్రత్యేకమైన తీరప్రాంత బర్త్‌లు అభివృద్ధి చేశారు. వీటి వివరాలు అనుబంధం-1 లో అందుబాటులో ఉన్నాయి.
అనుబంధం-1
|
వరస నెం.
|
ఓడరేవు
|
ప్రత్యేక కోస్టల్ బెర్తుల సంఖ్య
|
|
1
|
చెన్నై పోర్టు అథారిటీ
|
1
|
|
2
|
కొచ్చిన్ పోర్టు అథారిటీ
|
1
|
|
3
|
కామరాజర్ పోర్ట్ లిమిటెడ్
|
2
|
|
4
|
జవహర్లాల్ నెహ్రూ పోర్టు అథారిటీ
|
1
|
|
5
|
పరదీప్ పోర్టు అథారిటీ
|
5
|
|
6
|
వీ ఓ చిదంబనార్ పోర్టు అథారిటీ
|
1
|
|
7
|
విశాఖపట్నం పోర్టు అథారిటీ
|
1
|
|
8
|
ముంబై పోర్టు అథారిటీ
|
3
|
|
9
|
శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్టు అథారిటీ
|
3
|
|
10
|
న్యూ మంగళూర్ పోర్టు అథారిటీ
|
2
|
కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ రాజ్యసభలో ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2290845)
आगंतुक पटल : 11