మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ ప్రాజెక్టులు
प्रविष्टि तिथि:
28 JUL 2026 4:02PM by PIB Hyderabad
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన మత్స్య శాఖ విభాగం (డీవోఎఫ్)... 2020-21 నుంచి ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 'ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన'ను అమలు చేస్తోంది. దేశంలో మత్స్య రంగాన్ని సుస్థిరమైన, బాధ్యతాయుతమైన విధానంలో అభివృద్ధి చేయడం ద్వారా 'నీలి విప్లవం' తీసుకురావడమే ఈ పథకం లక్ష్యం. పీఎంఎంఎస్‌వై కింద, రాష్ట్రంలో మత్స్య రంగం, సంబంధిత మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను భారత ప్రభుత్వ మత్స్యశాఖ ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ. 2328.89 కోట్లు కాగా, ఇందులో కేంద్రం వాటా రూ. 681.38 కోట్లుగా ఉంది. రాష్ట్రం నిధులను వినియోగించుకున్న తీరు ఆధారంగా ఇప్పటివరకు రూ. 445.05 కోట్ల మొత్తాన్ని రాష్ట్రానికి విడుదల చేశారు. గత ఆరేళ్లలో ఈ పథకం కింద ఆమోదించిన ప్రాజెక్టులు, మంజూరు చేసిన, విడుదల చేసిన నిధులకు సంబంధించిన వివరాలను 'అనుబంధం-I' లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం పీఎంఎంఎస్‌వై కింద ఆమోదించిన ప్రధాన మత్స్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో (i) 5 చేపల దాణా ప్లాంట్ల ఏర్పాటు, (ii) 16 కోల్డ్ స్టోరేజీలు, ఐస్ ప్లాంట్లు, (iii) 6 ఆధునిక చేపల ల్యాండింగ్ కేంద్రాలు, (iv) 3 ఆధునిక ఫిషింగ్ హార్బర్‌లు, (v) విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, (vi) 1 సమీకృత ఆక్వా పార్క్ భాగంగా ఉన్నాయి. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన మరో 15 తీరప్రాంత మత్స్యకారుల గ్రామాలు (సీఆర్‌సీఎఫ్‌వీ), ఒక ఫిష్ బ్రూడ్ బ్యాంక్‌నూ మంజూరు చేశారు.
వాటాదారులు, ఎగుమతి ప్రోత్సాహక సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ... భౌగోళిక రాజకీయ పరిస్థితులు సహా ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సముద్ర సంబంధిత ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై పశ్చిమాసియా సంఘర్షణ ప్రభావం గురించి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక అంచనా ఏదీ నిర్వహించనప్పటికీ... తలెత్తుతున్న వాణిజ్య సవాళ్లను పరిష్కరించడానికి భారత ప్రభుత్వ మత్స్య శాఖ అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 2026, ఏప్రిల్ నెలలో న్యూఢిల్లీలో 'సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ మీట్', జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా 'సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్' పై జాతీయ స్థాయి కార్యశాలనూ నిర్వహించారు. ఈ కార్యశాలలో మార్కెట్‌ను విస్తరించడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు), నాన్-టారిఫ్ అవరోధాలు, ట్రేసెబిలిటీ, లాజిస్టిక్స్, ఎగుమతి సామర్థ్యాలకు సంబంధించిన అంశాలపై వాటాదారులతో చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ, వాణిజ్య సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, భారత ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రయత్నాల ఫలితంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత సముద్ర సంబంధిత ఆహార ఉత్పత్తుల ఎగుమతులు రూ. 73,890.46 కోట్ల (8.46 బిలియన్ల అమెరికన్ డాలర్ల) విలువతో 19.72 లక్షల మెట్రిక్ టన్నుల సర్వకాలిక గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయి.
***
అనుబంధం I
ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటన
(రూపాయలు లక్షలలో)
|
క్రమ సంఖ్య
|
సంవత్సరం
|
మొత్తం ప్రాజెక్టు వ్యయం
|
కేంద్ర ప్రభుత్వ వాటా
|
విడుదలైన నిధులు
|
|
1
|
2020-21
|
27560.00
|
7957.00
|
7957.00
|
|
2
|
2021-22
|
41400.97
|
15806.02
|
14452.00
|
|
3
|
2022-23
|
148828.20
|
38,514.40
|
19258.00
|
|
4
|
2023-24
|
7145.00
|
2748.00
|
687.00
|
|
5
|
2024-25
|
6815.00
|
2457.00
|
641.00
|
|
6
|
2025-26
|
1139.99
|
655.65
|
1509.85
|
|
|
మొత్తం
|
232889.16
|
68,138.07
|
44504.85
|
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ (అలియాస్ లాలన్ సింగ్) లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2290834)
आगंतुक पटल : 18