ఆయుష్
azadi ka amrit mahotsav

లే లో యోగా వెల్‌నెస్ ఇన్ స్ట్రక్టర్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన ఎండీఎన్ఐవై, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోవా-రిగ్పా

प्रविष्टि तिथि: 27 JUL 2026 3:14PM by PIB Hyderabad

లే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోవా-రిగ్పా (ఎన్ఐఎస్ఆర్)లో మూడు నెలల (400 గంటలయోగా వెల్‌నెస్ ఇన్ స్ట్రక్టర్ సర్టిఫికేట్ కోర్సు ప్రారంభమైందిఎండీఎన్ఐవై మార్గదర్శకాలకు అనుగుణంగా న్యూఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎండీఎన్ఐవై), లే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోవా-రిగ్పా సంయుక్తంగా ఈ కోర్సును నిర్వహిస్తున్నాయి.

ప్రధానమంత్రి యోగా అవార్డు గ్రహీతమహాబోధి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ (ఎంఐఎంసీవ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ భిక్కు సంఘసేన చేతుల మీదుగా ఈ కోర్సు ప్రారంభమైందిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూటీ లద్దాఖ్ ఆయుష్ఆరోగ్యవైద్య విద్య శాఖ డైరెక్టర్ డాక్టర్ తాషి థిన్లాస్ హాజరయ్యారుప్రారంభ సదస్సుకు లే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోవా-రిగ్పా (ఎన్ఐఎస్ఆర్డైరెక్టర్ డాక్టర్ పద్మ గుర్మెట్ అధ్యక్షత వహించారు.

లద్దాఖ్ లో మొదటిసారిగా నిర్వహించిన యోగా వెల్‌నెస్ సర్టిఫికెట్ కోర్సులో చేరిన అభ్యర్థులను డాక్టర్ పద్మ గుర్మెట్ అభినందించారుఈ శిక్షణ కార్యక్రమంలోని సిద్ధాంతఆచరణాత్మక అంశాల్లో క్రియాశీలకంగా పాల్గొనిఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారులద్దాఖ్ ప్రజల క్షేమం కోసం యోగాధ్యానాన్ని ప్రోత్సహించటంలో గౌరవ భిక్కు సంఘసేన చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారుసమాజహితానికి సంప్రదాయ ఆరోగ్య వ్యవస్థలనువిధానాలను ప్రోత్సహించేందుకు ఎన్ఐఎస్ఆర్ నిబద్ధతను తెలియజేశారు.

యోగ విద్య ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణనుసంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోవా-రిగ్పా చేస్తున్న కృషిని డాక్టర్ తాషి థిన్లాస్ అభినందించారుసంపూర్ణ ఆరోగ్యాన్నిసంక్షేమాన్ని సాధించేందుకు ఆధునిక వైద్యంసంప్రదాయ వైద్యంయోగా అనుసంధానానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను స్పష్టం చేశారుకేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ లో యోగా నిపుణుల పరిధినిఆరోగ్య రంగంలో యోగాను చేర్చే ప్రణాళికను కూడా ఆయన వివరించారు.

గౌరవ భిక్కు సంఘసేన మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యాన్నిమానసిక ప్రశాంతతనుఆధ్యాత్మిక సంక్షేమాన్ని పెంపొందించే జీవన విధానంగా యోగాను అభివర్ణించారువ్యక్తిగత వికాసంతో పాటు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడేలా యోగాను నిబద్ధతతోఅంకితభావంతో స్వీకరించాలని విద్యార్థులను ప్రోత్సహించారుయోగాధ్యానం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని చెబుతూ.. కోర్సు సమయంలో ధ్యానం కోసం మహాబోధి మెడిటేషన్ సెంటర్‌ను సందర్శించాల్సిందిగా విద్యార్థులనుఅధ్యాపకులను ఆహ్వానించారు.

విద్యార్థులకు ప్రోగ్రాం షెడ్యూల్కోర్సు మార్గదర్శకాల గురించి కోర్సు కో-ఆర్డినేటర్ శ్రీ గోపాల్ శర్మ విద్యార్థులకు వివరించారుమూడు నెలల యోగా వెల్‌నెస్ ఇన్ స్ట్రక్టర్ సర్టిఫికేట్ కోర్సు లాంఛనంగా ప్రారంభమైనట్లు కొత్తగా చేరిన అభ్యర్థులకు చెబుతూ.. కుమారి డోల్మా త్సెరింగ్ ధన్యవాదాలు తెలపటంతో ప్రారంభ కార్యక్రమం ముగిసింది.

***


(रिलीज़ आईडी: 2289992) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Tamil