ప్రధాన మంత్రి కార్యాలయం
యువత భవిష్యత్తుకు భద్రత కల్పిస్తూ పేపర్ లీక్ కేసుల విచారణకు ఫాస్ట్–ట్రాక్ కోర్టులను ప్రకటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 JUL 2026 9:46AM by PIB Hyderabad
యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు.
పేపర్ లీకుల్లో ప్రమేయం ఉన్నవారికి త్వరితగతిన, కఠినమైన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న వరుస చర్యల్లో ఇది కూడా ఒకటని ఆయన అన్నారు.
యువతకు హాని తలపెట్టేందుకు ప్రయత్నించిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:
‘‘యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే మరేదీ ముఖ్యం కాదు!
పేపర్ లీకుల్లో ప్రమేయం ఉన్నవారిపై త్వరితగతిన, కఠినమైన చర్యలను తీసుకొనేందుకు ఫాస్ట్–ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని మేం నిర్ణయించాం. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా మేం చేపడుతున్న చర్యల్లో ఇది కూడా ఓ భాగం.
యువతకు హాని తలపెట్టేందుకు ప్రయత్నించిన వారిని ఉపేక్షించం.’’
***
MJPS/SS/PRK
(रिलीज़ आईडी: 2288180)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam