సహకార మంత్రిత్వ శాఖ
భారత్ టాక్సీ సేవలు
प्रविष्टि तिथि:
21 JUL 2026 5:30PM by PIB Hyderabad
భారత్ టాక్సీ- సహకార నమూనా కింద పారదర్శకంగా డ్రైవర్ల యాజమాన్యంలో నడిచే రవాణా సేవలను అందించడానికి 'సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్' నిర్వహిస్తోన్న ఒక సహకార రవాణా అప్లికేషన్. ఈ వేదికలో సారథి (డ్రైవర్) అప్లికేషన్, ప్రయాణికుల యాప్, బ్యాకెండ్ నిర్వహణ వ్యవస్థ ఉన్నాయి. సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్.. దేశవ్యాప్తంగా డ్రైవర్ల ఆన్‌బోర్డింగ్, వినియోగదారుల రిజిస్ట్రేషన్, పత్రాల పరిశీలన, శిక్షణ, సేవల విస్తరణతో సహా ఈ వేదికను విడతల వారీగా అందుబాటులోకి తీసుకువస్తోంది.
ప్రస్తుతం భారత్ టాక్సీ సేవలు ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్‌లోని నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వేదికలో ఇప్పటివరకు 7.76 లక్షల మంది డ్రైవర్లు, 40.84 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.
భారత్ టాక్సీ సేవలను సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ దశలవారీగా విస్తరిస్తోంది. మరిన్ని నగరాలు, రాష్ట్రాల్లో ఈ సేవలను ప్రారంభించటం- నిర్వహణ అవసరాలు, అవసరమైన అనుమతులపై ఆధారపడి ఉంటుంది. నిర్వహణ సన్నద్ధత, డ్రైవర్ల అందుబాటు, చట్టపరంగా అవసరమైన ప్రక్రియను పూర్తి చేయటం.. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, సహకార సంస్థలు ఇతర భాగస్వాములతో సమన్వయం వంటి అంశాలపై ఈ విస్తరణ ఆధారపడి ఉంటుంది.
సమగ్ర అమలు ప్రణాళికకు అనుగుణంగా సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్... నిర్వహణ సన్నద్ధత, వర్తించే చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయటం, అవసరమైన అనుమతులను పొందటం, ఇతర పరిపాలనా పరమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే భారత్ టాక్సీ సేవల విస్తరణను చేపడుతుంది.
ఏ రాష్ట్రంలోనైనా భారత్ టాక్సీ సేవలను ప్రారంభించడానికి ముందు సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రవాణా శాఖ, పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపల్ అధికారులు, సహకార శాఖలతో సహా సంబంధిత విభాగాలతో అవసరమైన సంప్రదింపులు చేపడుతుంది. వర్తించే చట్టపరమైన నిబంధనల పరిధికి అనుగుణంగా అవసరమైన లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, అనుమతులు, ఇతర చట్టబద్ధమైన ఆమోదాలను సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ పొందుతుంది. అవసరమైన చట్టపరమైన, పరిపాలనాపరమైన ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
అమలు ప్రక్రియలో భాగంగా ఒక నగరంలో భారత్ టాక్సీ సేవలను ప్రారంభించడానికి ముందు సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్.. డ్రైవర్ల నమోదు, ప్రజలలో అవగాహన కార్యక్రమాలను చేపడుతుంది. ఇటువంటి కార్యక్రమాలలో భారత్ టాక్సీ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ శాఖలు- స్థానిక అధికారులతో భాగస్వామ్యం కావడం, అవసరమైన అవగాహన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి, తన సేవల గురించిన సమాచారాన్ని అందించడానికి భారత్ టాక్సీ అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికల్లో చురుగ్గా అందుబాటులో ఉంటుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంగా ఇచ్చారు.
***
(रिलीज़ आईडी: 2287516)
आगंतुक पटल : 24