నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎం సేతు- స్థాయి పెంపు- ప్రస్తుత పరిస్థితి

प्रविष्टि तिथि: 20 JUL 2026 4:13PM by PIB Hyderabad

దేశంలో వృత్తిపరమైన శిక్షణలో నాణ్యతనుప్రయోజనాలను విస్తరించడమే ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటి ట్రాన్సఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్ (పీఎం–సేతుపథకం లక్ష్యంఈ పథకం మొత్తం అంచనా వ్యయం రూ. 60,000 కోట్లు (కేంద్ర వాటా రూ.30,000 కోట్లురాష్ట్ర వాటా 20,000 కోట్లుపరిశ్రమ వాటా రూ.10,000 కోట్లు).

ఈ పథకంలో రెండు విభాగాలున్నాయి.

i. మొదటి విభాగం – హబ్ అండ్ స్పోక్ విధానంలో 1,000 ప్రభుత్వ ఐటీఐలను (200 హబ్ ఐటీఐలు, 800 స్పోక్ ఐటీఐలుమెరుగుపరచడంవాటిలో స్మార్ట్ తరగతి గదులుమెరుగైన ప్రయోగశాలలుడిజిటల్ కంటెంట్పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ఉంటాయి.

ii. రెండో విభాగం – భువనేశ్వర్చెన్నైహైదరాబాద్కాన్పూర్లూధియానాలో ఉన్న అయిదు ఎన్ఎస్‌టీఐల సామర్థ్యం పెంపువాటిలో ఆయా రంగాల వారీగా జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడంఅంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా శిక్షకులకు శిక్షణ ఇవ్వడంపాఠ్యాంశాల అభివృద్ధి ఉంటాయి.

పారిశ్రామిక శిక్షణ కేంద్రాల నాణ్యతనూప్రయోజనాలనూ విస్తరించడమే లక్ష్యంగా మహారాష్ట్రమధ్యప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలూకేంద్రపాలిత ప్రాంతాల్లో పీఎం–సేతు పథకం అమలవుతోందిప్రధాన పారిశ్రామిక భాగస్వాములు (ఏఐపీలుసమర్పించిన ఆరు వ్యూహాత్మక పెట్టుబడుల ప్రణాళిక (ఎస్ఐపీ)లకు జాతీయ స్టీరింగ్ కమిటీ (ఎన్ఎస్‌సీఆమోదం తెలిపిందివాటిలో తెలంగాణ నుంచి మూడుఆంధ్రప్రదేశ్ఒడిశాగుజరాత్ నుంచి ఒక్కొక్కటి చొప్పున ప్రణాళికలున్నాయిఆమోదించిన క్లస్టర్ల వివరాలుప్రధాన పారిశ్రామిక భాగస్వాముల వివరాలు దిగువ పేర్కొన్న పట్టిక-1లో ఉన్నాయి.

పట్టిక 1: జాతీయ స్టీరింగ్ కమిటీ ఆమోదించిన క్లస్టర్ వివరాలు

 

క్రమ సంఖ్య

రాష్ట్రం పేరు

క్లస్టర్ పేరు

హబ్ ఐటీఐ

స్పోక్ ఐటీఐలు

1

ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నం క్లస్టర్

ప్రభుత్వ ఐటీఐ,

కంచరపాలెం

ప్రభుత్వ ఐటీఐ (మహిళలు), విశాఖపట్నం

ప్రభుత్వ ఐటీఐబొబ్బిలి

ప్రభుత్వ ఐటీఐనర్సీపట్నం

2

ఒడిశా

కియోంజార్–బార్బిల్ క్లస్టర్

ప్రభుత్వ ఐటీఐబార్బిల్

ప్రభుత్వ ఐటీఐఆనందపూర్ప్రభుత్వ ఐటీఐ కొయిరాప్రభుత్వ ఐటీఐ కరాంజియాప్రభుత్వ ఐటీఐ బార్కొటే

3

గుజరాత్

సూరత్ క్లస్టర్

ప్రభుత్వ ఐటీఐసూరత్

ప్రభుత్వ ఐటీఐసూరత్ (మహిళలు)

ప్రభుత్వ ఐటీఐహజిరా

ప్రభుత్వ ఐటీఐబర్డోలి

ప్రభుత్వ ఐటీఐ (మహిళలు), సాచిన్

4

తెలంగాణ

పాత బస్తీ క్లస్టర్

ప్రభుత్వ ఐటీఐ,

పాతబస్తీ

ప్రభుత్వ ఐటీఐవరంగల్

ప్రభుత్వ ఐటీఐ(బాలురు), నల్లగొండ

ప్రభుత్వ ఐటీఐవికారాబాద్

ప్రభుత్వ ఐటీఐపంజాగూడ

5

తెలంగాణ

పటాన్ చెరు క్లస్టర్

ప్రభుత్వ ఐటీఐపటాన్‌చెరు

ప్రభుత్వ ఐటీఐనల్లగొండ(న్యూ)

ప్రభుత్వ ఐటీఐమార్పల్లి,

ప్రభుత్వ ఐటీఐభువనగిరి

ప్రభుత్వ ఐటీఐషాద్ నగర్ 

6

తెలంగాణ

సంగారెడ్డి క్లస్టర్

ప్రభుత్వ ఐటీఐసంగారెడ్డి

ప్రభుత్వ ఐటీఐహత్నూర

ప్రభుత్వ ఐటీఐమెదక్

ప్రభుత్వ ఐటీఐఎల్లారెడ్డి

 ప్రభుత్వ ఐటీఐదుబ్బాక

 

 

ఎన్ఎస్‌టీఐలను మెరుగుపరిచేందుకు ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానించారు.

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పీఎం–సేతు పథకం కింద నాగ్‌పూర్ఛత్రపతి శంభాజీ నగర్పూణే జిల్లాలలో హబ్ ఐటీఐలతో కూడిన మూడు క్లస్టర్లను గుర్తించిందిపారిశ్రామిక ప్రతిపాదనలను ఆహ్వానించడానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్‌పీ)‌ను మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందిప్రస్తుతంఈ రాష్ట్రం నుంచి ఏ ప్రతిపాదన లేదా వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక (ఎస్ఐపీజాతీయ స్టీరింగ్ కమిటీ (ఎన్ఎస్‌సీవద్ద పరిశీలన లేదా ఆమోదం కోసం పెండింగ్‌లో లేదు.

పీఎం–సేతు పథకం పరిధిలో 20 హబ్ ఐటీఐలు, 81 స్పోక్ ఐటీఐలతో కూడిన 20 క్లస్టర్లను మధ్యప్రదేశ్ గుర్తించిందిపారిశ్రామిక ప్రతిపాదనల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్‌పీ)ను మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆహ్వానించిందిప్రస్తుతం.. ఈ రాష్ట్రం నుంచి వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక (ఎస్ఐపీఆమోదం కోసం లేదా పరిశీలన కోసం జాతీయ స్టీరింగ్ కమిటీ వద్ద పెండింగ్‌లో లేదు.  

రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్టీరింగ్ కమిటీ (ఎస్ఎస్‌సీ)లను 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశాయిఇది పథకం అమలుకు మార్గదర్శకత్వం వహించేఅమలును పర్యవేక్షించే అపెక్స్ వ్యవస్థగా  పనిచేస్తుందిపారిశ్రామిక ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానిస్తూ.. 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతిపాదనలను ఆహ్వానించాయి.

జాతీయ స్థాయిలో మొత్తం ఎస్ఐపీలకు ఆమోదం లభించిందిమహారాష్ట్ర నుంచి ఎలాంటి ప్రతిపాదన పెండింగులో లేదుఅయిదేళ్ల కాలంలో దశలవారీగా అమలు చేసేలా ఈ పథకాన్ని ప్రతిపాదించారు.

నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామిక రంగం మంత్రిత్వశాఖ (ఎంఎస్‌డీఈసహాయ మంత్రి (స్వతంత్రశ్రీ జయంత్ చౌదరి ఈ సమాచారాన్ని లోక్‌సభలో ఈ రోజు లిఖితపూర్వకంగా అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2286751) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil