ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఖతార్ అమీర్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి


ఫాదర్ అమీర్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన పీఎం

భారత్-ఖతార్ సంబంధాలను బలోపేతం చేసేందుకు ఫాదర్ అమీర్‌ చేసిన కృషినీ, దార్శనిక నాయకత్వాన్నీ ప్రస్తావించిన పీఎం

ఫాదర్ అమీర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇరువురు నేతల అంగీకారం

प्रविष्टि तिथि: 16 JUL 2026 9:37PM by PIB Hyderabad

ఖతార్ అమీర్ గౌరవ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఫోన్లో మాట్లాడారు.

ఫాదర్ అమీర్ గౌరవ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం వ్యక్తం చేశారు.

ఆధునిక రూపశిల్పిగా హమద్ బిన్ ఖలీఫా ఖతార్‌కు చేసిన విశేష కృషిని ప్రధానమంత్రి గుర్తు చేశారుఆయన దార్శనిక నాయకత్వానికి ప్రధానమంత్రి నివాళి అర్పించారుభారత్-ఖతార్ సంబంధాలను బలోపేతం చేయటంలో ఫాదర్ అమీర్ కీలక పాత్రను పోషించారని.. భారత్‌పైఖతార్‌లోని భారతీయులపై అమితమైన ప్రేమను చూపారని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు.

ఈ విషాద సమయంలో ఫోన్ చేసి మద్దతు తెలిపినందుకు ప్రధానమంత్రికి ఖతార్ అమీర్‌ ధన్యవాదాలు తెలిపారు.

ఫాదర్ అమీర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనిభారత్ఖతార్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్నిఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలనీ ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు.

భవిష్యత్తులోనూ సంప్రదింపులను కొనసాగించాలని ఇరువురు నేతలు అంగీకరించారు.

 

***


(रिलीज़ आईडी: 2285657) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam