పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
సవరించిన ఉడాన్ పథకంపై భాగస్వాముల వర్క్‌షాప్‌ను ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు
విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సవరించిన ఉడాన్ మార్గదర్శకాలను విమానయాన రంగానికి చెందిన ప్రతినిధులకు తెలియజేసిన కేంద్ర మంత్రి
प्रविष्टि तिथि:
16 JUL 2026 5:43PM by PIB Hyderabad
దేశంలో ప్రాంతీయ విమానయాన అనుసంధానత భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు విమానయాన రంగానికి చెందిన ముఖ్యమైన భాగస్వాములతో కేంద్ర ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 'ఉడాన్ పథకం తదుపరి దశ'పై ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూలై 4న జోధ్‌పూర్ విమానాశ్రయంలో ఈ 'సవరించిన ఉడాన్' పథకాన్ని ప్రారంభించారు.
విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ వర్క్‌షాప్‌ను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) ఛైర్మన్ శ్రీ విపిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమానయాన అనుసంధానతను పెంపొందించడంలో 'ఉడాన్' పథకం సాధించిన విజయాలను, తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఒక డిజిటల్ ప్రదర్శనతో కార్యక్రమం మొదలైంది. ప్రారంభోత్సవ సెషన్‌లో భాగంగా ఉడాన్ పథకం సాధించిన విజయగాథను వివరిస్తూ రూపొందించిన ఒక లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శించారు.
ఈ సదస్సులో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలకోపన్యాసం చేశారు. ఇందులో భాగంగా 'ఉడాన్' తదుపరి దశ గురించి ఆయన చెప్పారు. ప్రాంతీయ విమానయాన అనుసంధానతను మరింత విస్తరించడం, దేశంలోని అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధిని ప్రోత్సహించడం, విమానయాన రంగానికి సంబంధించిన ప్రయోజనాలు దేశంలోని ప్రతి మూలకూ చేరేలా చూడాలనే ప్రభుత్వ దృక్పథాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
"2001లో భారత్‌లో 65 విమానాశ్రయాలు ఉండేవి. 2014 నాటికి ఆ సంఖ్య 74కి పెరిగింది. అంటే 13 ఏళ్లలో కేవలం 9 విమానాశ్రయాలు మాత్రమే అదనంగా ఏర్పాటయ్యాయి. కానీ గత 12 ఏళ్లలో మనం ఏకంగా 90 విమానాశ్రయాలను కొత్తగా నిర్మించాం. 9 నుంచి 90 కి చేరుకున్నాం. గతంలో వాడుకలో లేని, సేవలు అందని 55 ఎయిర్‌స్ట్రిప్స్‌ను పునరుద్ధరించి వాటిని పూర్తిస్థాయిలో పనిచేసే విమానాశ్రయాలుగా మార్చాం. భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ పౌరవిమానయాన మార్కెట్‌గా ఎదగడం అనేది గౌరవ ప్రధానమంత్రి సుదూర ఆలోచనల నుంచి పుట్టిన 'ఉడాన్' దార్శనికత వల్లే సాధ్యమైంది. 10 ఏళ్ల క్రితం విమాన ప్రయాణాలు ఎక్కువగా అభివృద్ధి చెందిన ఆరు ప్రధాన నగరాలకే పరిమితమై ఉండేవి. దీనివల్ల ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు చాలా తక్కువగా అందేవి లేదా అసలు అందేవి కావు. కానీ ముందుచూపుతో కూడిన నాయకత్వంలో ప్రధానమంత్రి ప్రకటించిన 'జాతీయ పౌరవిమానయాన విధానం 2016' మన విమానయాన రంగ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది" అని పౌరవిమానయాన శాఖ మంత్రి వ్యాఖ్యానించారు.
ఉడాన్ ప్రభావం గురించి మాట్లాడుతూ.. "ప్రధానమంత్రి పరివర్తనాత్మక నాయకత్వంలో దేశంలో విమాన ప్రయాణాలపై ప్రజల ఆలోచన విధానం మారింది. సామాన్య మానవుడి మనస్తత్వంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఒకప్పుడు 10-20 ఏళ్ల క్రితం జనం విమానాలను చూడటానికి విమానాశ్రయాల ప్రహరీ గోడల వెలుపల నిలబడేవారు. కానీ నేటి తరానికి ఆ జ్ఞాపకం ఉండదు. ప్రధాని కల అయిన 'హవాయి చప్పల్ వేసుకునేవాడు కూడా హవాయి జహాజ్ ఎక్కాలి' అనేది నిజ రూపం దాల్చింది. మధ్యతరగతి, నూతన మధ్యతరగతికి చెందిన సామాన్య ప్రజలు ఈ రోజు ఎంతో ఆత్మవిశ్వాసంతో విమానాశ్రయాల్లోకి అడుగుపెడుతూ దేశంలోని మారుమూల ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. చివరకు విమానాశ్రయాలలో కూడా మేం 'ఉడాన్ యాత్రి కేఫ్'లను ప్రారంభించాం. దీనివల్ల ప్రయాణికులకు చాలా తక్కువ ధరలోనే అల్పాహారాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ కేవలం రూ. 10లకే టీ, రూ. 20లకే స్నాక్స్ లభిస్తాయి" అని శ్రీ రామ్మోహన్ నాయుడు అన్నారు.
భారత విమానయాన రంగం సాధించిన స్థిరమైన వృద్ధి, పటిష్టతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. "ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్న తరుణంలో కూడా మన దేశంలో ప్రతిరోజూ దాదాపు ఐదు లక్షల మంది దేశీయ ప్రయాణికులు విమానాల్లో ప్రయాణిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. నిజానికి మే నెలలో భారత్ తన అత్యధిక నెలవారీ దేశీయ విమాన ప్రయాణాల రికార్డును నమోదు చేసింది. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 1.5 కోట్లకు పైగా ప్రయాణికులు విమాన సేవలను ఉపయోగించుకున్నారు" అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పేర్కొన్నారు.
ఉడాన్ పథకం సాధించిన విజయగాథల గురించి మాట్లాడుతూ.. "గతంలో బీహార్‌లోని దర్భంగా ప్రజలు కేవలం ఒక ఫ్లైట్ ఎక్కడం కోసం 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. కానీ ఈ రోజు దర్భంగాకు చెందిన ప్రసిద్ధ 'షాహీ లిచీ' పండ్లు నేరుగా దుబాయ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకుంటున్నాయి. అలాగే రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌కు మరొక అద్భుతమైన విజయగాథ ఉంది. 2017లో అక్కడ విమానాశ్రయం ఏర్పాటు కావడానికి ముందు అక్కడి ప్రసిద్ధ మార్బుల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఎగుమతులకు ప్రత్యక్ష విమాన సౌకర్యం లభించడంతో పాటు ఏటా పుష్కర్ ఆలయానికి, అజ్మీర్ దర్గాకు వెళ్లే దాదాపు 2 కోట్ల మంది యాత్రికులకు సులువైన ప్రయాణ మార్గం దొరికింది. కేషోద్, దేవ్‌గఢ్, ఝార్సుగూడ, నాందేడ్.. ఇలా ఉడాన్ పథకం సాధించిన విజయగాథలు ఎన్నో ఉన్నాయి" అని శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నాయుడు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా 'సవరించిన ఉడాన్' పథకంలోని నిబంధనలపై హాజరైన ప్రతినిధులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి ఒక ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతమున్న పాత విధానంతో పోల్చుతూ సవరించిన ఈ కొత్త ఉడాన్ పథకం ఏ విధంగా మెరుగైనదో ఆయన ఒక సమగ్ర సమీక్ష ద్వారా స్పష్టంగా వివరించారు.
సవరించిన ఉడాన్ పథకం నిబంధనల సరిపోలిక
|
పథకంలోని నిబంధన
|
ప్రస్తుత ఉడాన్ పథకం
|
సవరించిన ఉడాన్ పథకం
|
-
ప్రయాణికులకు అందుబాటులో విమాన ఛార్జీలు
|
|
|
|
|
|
|
|
|
-
విమానయాన సంస్థలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్
|
|
|
|
3వ సంవత్సరం – మంజూరైన వీజీఎఫ్‌లో 75 శాతం
4వ సంవత్సరం – మంజూరైన వీజీఎఫ్‌లో 50 శాతం
5వ సంవత్సరం – మంజూరైన వీజీఎఫ్‌లో 25 శాతం
|
-
విమానాశ్రయాల అభివృద్ధి
|
|
|
|
-
ఛాలెంజ్ మోడ్ తర్వాత బిడ్డింగ్ కోసం పథకంలో చేర్చడానికి, అభివృద్ధి చేసేందుకు విమానాశ్రయాలకు ప్రాధాన్యత లభిస్తుంది.
-
విమానాశ్రయాలను ఎంపిక చేయడానికి, మార్గాలను రూపొందించడానికి విమానయాన సంస్థలు మార్కెట్ ఆధారిత విధానాన్ని అనుసరించాలి.
|
|
|
|
-
ఎంపిక చేసిన విమానాశ్రయాల అభివృద్ధికి బడ్జెట్ మద్దతు: 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా రాబోయే 10 సంవత్సరాలలో ఒక్కో విమానాశ్రయానికి రూ. 100 కోట్ల చొప్పున మొత్తం 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి దాదాపు రూ. 12,159 కోట్లు (ద్రవ్యోల్బణ సర్దుబాటుతో సహా) కేటాయిస్తారు.
-
హిమాలయ- ఈశాన్య రాష్ట్రాలు (హైనర్), ఆకాంక్షిత జిల్లాల్లో 200 అత్యాధునిక హెలిప్యాడ్‌లను అభివృద్ధి చేయడం: ఒక్కో ఆధునిక హెలిప్యాడ్‌కు రూ. 15 కోట్ల చొప్పున మొత్తం 200 హెలిప్యాడ్‌ల నిర్మాణానికి దాదాపు రూ. 3,661 కోట్లు (ద్రవ్యోల్బణ సర్దుబాటుతో సహా) అవసరమవుతాయి.
|
|
|
|
-
ఆర్‌సీఎస్ కింద అభివృద్ధి చేసిన విమానాశ్రయాల్లో సిబ్బంది జీతభత్యాల కొరకు 3 సంవత్సరాల పాటు కార్యాచరణ, నిర్వహణ (ఓ-ఎం) మద్దతు ఇస్తారు. దీని కింద ఒక్కో విమానాశ్రయానికి సంవత్సరానికి గరిష్ఠంగా రూ. 3.06 కోట్ల వరకు.. అలాగే ఒక్కో హెలిపోర్ట్ లేదా వాటర్ ఏరోడ్రోమ్‌కు సంవత్సరానికి గరిష్ఠంగా రూ. 0.9 కోట్ల వరకు నిధులు కేటాయిస్తారు.
|
-
మార్గాల సుస్థిరత
|
|
|
|
|
|
|
-
గత డీజీసీఏ షెడ్యూల్‌లో వారానికి 7 కంటే ఎక్కువ వాస్తవ విమాన ప్రయాణాలు ఉన్న విమానాశ్రయాలను సేవలు అందిస్తున్నట్లుగా పరిగణిస్తారు.
-
ప్రాధాన్యతా ప్రాంతాలకు ఇది వారానికి 14 కంటే ఎక్కువ వాస్తవ విమాన ప్రయాణాలుగా పరిగణిస్తారు.
|
-
వారానికి సగటున 14 కంటే ఎక్కువ వాస్తవ షెడ్యూల్డ్ విమాన సర్వీసులు నడుస్తున్నవి.
-
సగటున 2 కంటే ఎక్కువ నగరాల జోడీలకు విమాన అనుసంధానం కలిగి ఉన్నవి.
-
చివరి 1 సంవత్సరంలో మొత్తం ప్రయాణికుల సంఖ్య 40,000 కంటే ఎక్కువగా ఉన్నవి.
|
|
|
|
|
|
|
-
కొత్తగా ప్రవేశించే విమానయాన సంస్థలను ప్రోత్సహించడానికి ప్రస్తుతం ఏఓపీ లేకుండానే బిడ్డింగ్‌కు అనుమతి ఇస్తున్నారు
-
కొన్నిసార్లు అటువంటి విమానయాన సంస్థలు తమ సామర్థ్యానికి మించిన అనేక మార్గాలు, నెట్‌వర్క్‌ల కోసం బిడ్ వేస్తాయి.
|
-
ఏఓపీ లేని విమానయాన సంస్థలను మార్గాల కోసం బిడ్డింగ్ వేయడానికి అనుమతించరు.
-
విమాన మార్గాల కేటాయింపు అనేది సదరు విమానయాన సంస్థ వ్యాపార ప్రణాళిక, వారి వద్ద అందుబాటులో ఉన్న విమానాల ఆధారంగా నిర్ణయిస్తారు.
-
ఒకవేళ కేటాయించిన సంస్థ నిర్ణీత కాలపరిమితిలోగా ఆ మార్గంలో విమాన సర్వీసులను ప్రారంభించడంలో విఫలమైతే సదరు మార్గానికి తిరిగి బిడ్డింగ్ నిర్వహిస్తారు. మొదట ఆ బిడ్ దక్కించుకుని విఫలమైన సంస్థను ఆ తదుపరి బిడ్డింగ్‌లో పాల్గొనకుండా నిషేధిస్తారు.
|
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా ప్రసంగించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్.. దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలకు ముఖ్యంగా ద్వితీయ- తృతీయ శ్రేణి నగరాలు, మారుమూల ప్రాంతాల ప్రజలకు తక్కువ ధరల్లో సులభతరమైన విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పథకం తదుపరి దశకు సంబంధించిన దార్శనికత, లక్ష్యాలు, అమలు విధానాన్నివివరించే 'ఉడాన్ పథక పత్రాన్ని' విడుదల చేయడం అనేది ఈ వర్క్‌షాప్‌లోనే ప్రముఖంగా నిలిచింది. ఈ పత్రం ప్రాంతీయ అనుసంధానతను మరింత బలోపేతం చేయడానికి, విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, విమానయాన రంగంలో సరికొత్త వృద్ధి అవకాశాలను పెంపొందించడానికి ఒక వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను అందిస్తుంది.
ఈ వర్క్‌షాప్‌లో వివిధ విమానయాన సంస్థల ప్రతినిధులు, విమానాశ్రయాల నిర్వాహకులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పరిశ్రమ వర్గాలు, ఇతర విమానయాన భాగస్వాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పథకం అమలు వ్యూహాలు, మౌలిక సదుపాయాల సంసిద్ధత, భాగస్వాముల మధ్య సమన్వయం, ప్రాంతీయ విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రధానంగా చర్చించారు.
ప్రారంభమైనప్పటి నుంచి విమాన ప్రయాణాన్ని సామాన్యుడికి సైతం అందుబాటులోకి తీసుకురావడంలో, సరైన సేవలు లేని- మారుమూల ప్రాంతాలను అనుసంధానించడంలో, పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో, వాణిజ్యాన్ని పెంపొందించడంలో, ఉపాధి అవకాశాలను సృష్టించడంలో 'ఉడాన్' పథకం అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. ఈ పథకం తదుపరి దశ ఈ విజయాల ఆధారంగా మరింత ముందుకు సాగుతూ భారతదేశ విమానయాన రంగ వృద్ధిని మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
***
(रिलीज़ आईडी: 2285655)
आगंतुक पटल : 8