ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విజ్ఞానం, నైపుణ్యాలు, ఆరోగ్యం గురించి వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 15 JUL 2026 12:12PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంస్కృత శ్లోకాన్ని పంచుకున్నారువిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంకొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడంఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో దేశ యువత బలమైన శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారుఈ లక్షణాలు వ్యక్తులను శక్తిమంతం చేయడమే కాకుండా.. దేశాభివృద్ధికి గణనీయమైన రీతిలో తోడ్పాటును అందిస్తాయి

ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత శ్లోకం –

‘‘ధన్యానాముత్తమం దాక్ష్యం ధనానాముత్తమం శ్రుతమ్ 

లాభానాం శ్రేయ ఆరోగ్యం సుఖానాం తుష్టిరుత్తమా || ’’

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు

విద్యతో వివేకంనైపుణ్యంతో అభివృద్ధి సాధ్యమవుతుందిమంచి ఆరోగ్యంతో ప్రతి సంకల్పమూ నెరవేరుతుందిఇప్పుడు మన యువత ఈ గుణాలను అలవర్చుకొని దేశ గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నారు.

ధన్యానాముత్తమం దాక్ష్యం ధనానాముత్తమం శ్రుతమ్ 

లాభానాం శ్రేయ ఆరోగ్యం సుఖానాం తుష్టిరుత్తమా || 

 

***


(रिलीज़ आईडी: 2284791) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam