సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
7.81 కోట్లకు పైగా యువత, 5.24 కోట్ల మందికి పైగా మహిళలు, 17 లక్షల విద్యా సంస్థలతో సహా దేశవ్యాప్తంగా 23 కోట్ల మందికి పైగా ప్రజలకు చేరువైన ఎన్ఎంబీఏ
ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ గల యువతపై దృష్టి సారించే ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ దేశ నిర్మాణంలో కీలక కార్యక్రమం: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్
మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాల ఆధారిత విధానాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక ప్రచారమే నషా ముక్త్ భారత్ అభియాన్: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి శ్రీ రామ్‌దాస్ అథవాలే
యువత, మహిళలు, సమాజాన్ని భాగస్వాములను చేస్తూ మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణంపై దృష్టి సారించిన జాతీయ కార్యక్రమం నషా ముక్త్ భారత్ అభియాన్: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి శ్రీ బి.ఎల్. వర్మ
प्रविष्टि तिथि:
08 JUL 2026 3:32PM by PIB Hyderabad
దేశంలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆగస్టు 15, 2020న నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ఎంబీఏ)ను ప్రారంభించింది. ఈ విషయంలో ఉమ్మడి కార్యాచరణ అవసరాన్ని గుర్తిస్తూ.. డ్రగ్స్ నివారణ, అంచనా, చికిత్స, పునరావాసం, తదుపరి సంరక్షణ, ప్రజలకు సమాచారాన్ని చేరవేయటం, సమాజంలో అవగాహన కల్పించటంతో సహా వివిధ కార్యక్రమాలను ఈ మంత్రిత్వ శాఖ సమన్వయం చేస్తుంది.
భారతదేశంలో మాదకద్రవ్యాల వ్యసనం.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలపై ప్రభావం చూపుతున్న నిశ్శబ్ద సంక్షోభం. దీన్ని అరికట్టేందుకు ఎన్ఎంబీఏ ప్రారంభంలో 272 ప్రభావిత జిల్లాలను లక్ష్యంగా చేసుకుని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించింది. దీనిద్వారా 7.81 కోట్లకు పైగా యువకులు, 5.24 కోట్ల మంది మహిళలు, 17 లక్షల విద్యాసంస్థలతో కలిపి మొత్తం 23 కోట్లకు పైగా ప్రజలను చేరుకుంది.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. దేశంలోని యువత ఆరోగ్యంగా, క్రమశిక్షణతో ఉండేలా చూసేందుకు నషా ముక్త్ భారత్ అభియాన్ అత్యంత కీలకమైన దేశ నిర్మాణ కార్యక్రమంగా పనిచేస్తుందన్నారు. భారతదేశాన్ని మాదకద్రవ్యాల రహిత దేశంగా మార్చేందుకు నార్కోటిక్స్ బ్యూరో వంటి నియంత్రణ సంస్థలు, రాష్ట్ర, జిల్లా ప్రభుత్వాలు, పోలీసు శాఖ, ఎన్జీవోలు, ఆసుపత్రులు మొదలైనవి సమన్వయంతో పనిచేసేలా ఎన్ఎంబీఏ దోహదపడిందని చెప్పారు.
మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సాక్ష్యాధారాల ఆధారిత విధానాన్ని బలోపేతం చేసేందుకు నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిష్ఠాత్మక ప్రచార కార్యక్రమమని సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి శ్రీ రామ్‌దాస్ అథవాలే తెలిపారు. భారతదేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చాలనే ఉమ్మడి లక్ష్యం కోసం.. యువత భాగస్వామ్యంతో సంబంధిత విభాగాలను ఏకం చేస్తూ సమగ్రంగా ఈ అభియాన్ విధానం సాగుతుందని ఆయన తెలిపారు.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి శ్రీ బి.ఎల్.వర్మ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ కార్యక్రమం నషా ముక్త్ భారత్ అభియాన్ అని తెలిపారు. ఈ ఉద్యమంలో యువత, మహిళలు, సమాజంలోని ఇతర సభ్యులను క్రీయాశీలకంగా భాగస్వాములను చేస్తున్నట్లు.. ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థలు, యువజన క్లబ్బులు, మహిళా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రతి పౌరుడికి అవగాహన కల్పించటమే ఈ ప్రచార ముఖ్య ఉద్దేశమని శ్రీ వర్మ చెప్పారు. ప్రాథమిక దశలోనే డ్రగ్స్ వాడకాన్ని నివారించటం, సమాజ భాగస్వామ్యం ద్వారా ఈ ఉద్యమం మరింత ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సమాజాన్ని నిర్మిస్తుందని, మాదకద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఎన్ఎంబీఏ ప్రధాన వాటాదారులు, లబ్ధిదారులు.. యువత, మహిళలు, పిల్లలు, విద్యా సంస్థలు, పౌర సమాజం, యావత్ సమాజం. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా విస్తృత శ్రేణి కార్యక్రమాలు జరిగాయి. ఇవి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను, వాటాదారులను భాగస్వాములను చేశాయి. మాదకద్రవ్యాల వ్యసనం సమస్యపై గతంలో లాగా కేవలం సంస్థల ప్రమేయానికే పరిమితం కాకుండా ఇప్పుడు సమాజం మొత్తాన్ని భాగస్వామ్యం చేసేలా మార్పు వచ్చింది. రాష్ట్రాలు, జిల్లాలు, ఇతర వాటాదారులు ఈ అభియాన్‌ను బాధ్యతగా స్వీకరించటంతో ఇది ప్రజా ఉద్యమంగా మారింది.
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోని వివిధ విభాగాలు, వాటాదారులతో కుదుర్చుకున్న భాగస్వామ్యాల ద్వారా ఎన్ఎంబీఏ లక్ష్యం క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలైంది. ఈ భాగస్వామ్యాలు పౌరుల్లో బాధ్యతను పెంచి, మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి సామాజిక వివక్షను తగ్గించాయి. అంగీకారాన్ని, జవాబుదారీతనాన్ని పెంపొందించాయి.
మాదకద్రవ్యాల వినియోగం మితిమీరి, వ్యసనంగా మార్చుకోవటం వల్ల సామాజిక, మానసిక, శారీరక సమస్యలు ఎదురవుతాయి. ఇది ఆరోగ్యాన్ని క్షీణించేలా చేయటమే కాక, పెను సామాజిక సమస్యగా మారింది.
డ్రగ్స్ వ్యసనానికి గురైన బాధితులకు సాయం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఉద్దేశించిన కార్యక్రమమే ఎన్ఎంబీఏ ప్రతిజ్ఞ. ప్రజలు డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా వారిలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను, సామాజిక బాధ్యతను పెంపొందించటం ఈ ప్రతిజ్ఞ ఉద్దేశం. ఉమ్మడి లక్ష్యం కోసం భాగస్వాములందరూ కలిసి పనిచేసేలా ఐక్యతను, నిబద్ధతను ప్రోత్సహించటం దీని లక్ష్యం. ఈ ప్రతిజ్ఞ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత క్రియాశీలకంగా పాల్గొనేలా చేస్తుంది.
హెల్ప్‌లైన్ నంబర్ 14446 ద్వారా మాదకద్రవ్యాల విముక్తిని ప్రోత్సహించేందుకు అందరూ కలిసి కృషి చేయాలి.
***
(रिलीज़ आईडी: 2282514)
आगंतुक पटल : 14