ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఔషధ నియమావళి-1945లో భాగంగా నవీ ముంబయి విమానాశ్రయాన్ని ఔషధాల దిగుమతికి కేంద్రంగా నోటిఫై చేసిన ప్రభుత్వం


నవీ ముంబయి విమానాశ్రయం నుంచి మందుల దిగుమతికి మార్గం సుగమం చేయడానికి నియమం ‘43ఎ’కు సవరణ

ఔషధాల దిగుమతి కోసం నోటిఫై చేసిన కేంద్రాల మొత్తం సంఖ్య 42కు చేరిక...
దీంతో ఔషధాలకు సంబంధించిన ఆధునిక వస్తు రవాణా వ్యవస్థతో పాటు వాణిజ్యానికి సౌలభ్యం

प्रविष्टि तिथि: 08 JUL 2026 10:43AM by PIB Hyderabad

ఔషధాల సరఫరా వ్యవస్థను పటిష్ఠపరిచే, వాణిజ్య సౌలభ్యాన్ని పెంచే దిశగా ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. మహారాష్ట్రలో ఇటీవలే ప్రారంభించిన నవీ ముంబయి విమానాశ్రయం ద్వారా మందులను దిగుమతి చేసుకోవడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గాన్ని సుగమం చేసింది.

ఔషధ నియమావళి-1945 లోని ‘43 ఎ’ నియమంలో చేసిన సవరణ ప్రకారం, దేశంలోకి మందులను దిగుమతి చేసుకోవడానికి ఉద్దేశించిన విమానాశ్రయాల జాబితాలో ఇక నవీ ముంబయిని కూడా చేర్చారు. ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం-1940 నిబంధనలలో భాగంగా ఔషధాల సాంకేతిక సలహా మండలిని సంప్రదించిన తరువాత, ఈ మేరకు నోటిఫికేషనును జారీ చేశారు. (రాజపత్రం నోటిఫికేషనును వెబ్ చిరునామా  https://egazette.gov.in/WriteReadData/2026/274223.pdf లో అందుబాటులో ఉంచారు).

ఈ సవరణతో, ఔషధ నియమావళి-1945 లో భాగంగా మందుల ఎగుమతి కోసం అనుమతించిన ప్రత్యేక విమానాశ్రయాల జాబితాలో  నవీ ముంబయి విమానాశ్రయాన్ని చేర్చారు. ఈ సరికొత్త చేర్పుతో, ప్రవేశ కేంద్రాల (రోడ్డు, రైలు, నౌక, వాయు మార్గాల) మొత్తం సంఖ్య 42కు చేరుకుంది. ఈ సవరణ మందుల కన్‌సైన్‌మెంట్లు సాఫీగా సాగడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఆధునిక వస్తు రవాణా వ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పటిష్ట పరుస్తుంది. అంతేకాక, భారత్‌లోకి ఔషధాల దిగుమతికి ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని జోడించి దిగుమతిదారు సంస్థలకు మరింత సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది.
ఈ చొరవ... నియంత్రణ సంబంధిత ప్రాథమిక ప్రణాళికను బలోపేతం చేస్తుంది. అలాగే తాజాగా తీసుకున్న నిర్ణయం దిగుమతి చేసుకొనే మందుల విషయంలో నియంత్రణ పూర్వక పర్యవేక్షణ సమర్థంగా ఉండేటట్లు నిర్ధారిస్తూ, వాణిజ్య సౌలభ్యాన్ని ప్రొత్సహించే దిశగా  ప్రభుత్వం చేపడుతున్న నిరంతర ప్రయత్నాలకు అనుగుణంగా కూడా  ఉంది.

 

***

 

(रिलीज़ आईडी: 2282385) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati