ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఆయనకు పుష్పాంజలి ఘటించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్

प्रविष्टि तिथि: 06 JUL 2026 3:13PM by PIB Hyderabad

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఆయనకు ఉపరాష్ట్రపతి భవన్లో పుష్పాంజలి ఘటించారు.
డాక్టర్ ముఖర్జీకి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ నివాళులు అర్పిస్తూ, దేశ ఏకత కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారని, అలాంటి ఘన త్యాగాలు ‘‘ఎన్నటికీ మరపురానివి’’ అని కొనియాడారు.
దేశంలో ఒకే రాజ్యాంగ ప్రాథమిక ప్రణాళిక పరిధిలో ప్రతి ఒక్కరికీ సమాన ప్రతిపత్తి లభించాలని డాక్టర్ ముఖర్జీ తలచారని ఉపరాష్ట్రపతి అన్నారు. దేశ సమైక్యత కోసం డాక్టర్ ముఖర్జీ జీవిత పర్యంతం కట్టుబడ్డారని, ప్రాణత్యాగానికైనా వెనుదీయని ఆయన ఆదర్శాలకు రాజ్యాంగ 370వ అధికరణాన్ని రద్దు చేయడం సముచిత నివాళి అని ఉపరాష్ట్రపతి అన్నారు.
భారత విద్యా, రాజకీయ, ప్రజాస్వామిక రంగాల్లో చెరగని ముద్రను వేసిన డాక్టర్ ముఖర్జీ ‘‘ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞ‌ుడు, దేశ నిర్మాత’’ అని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమాల్లో పొందుపరిచిన ఒక సందేశంలో ప్రస్తావించారు.
ఆయన అసాధారణ ప్రజాజీవితాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేస్తూ, అతి పిన్న వయస్సులోనే కలకత్తా విశ్వవిద్యాలయ ఉప కులపతులైన వారిలో డాక్టర్ ముఖర్జీ ఒకరని, రాజ్యాంగ పరిషత్తు సభ్యులలో ఆయనకు స్థానాన్ని కల్పించారని, అఖిల భారతీయ హిందూ మహాసభకు అధ్యక్షునిగా, స్వతంత్ర భారతదేశ మొదటి పరిశ్రమ, సరఫరాల శాఖ మంత్రిగా, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకునిగా డాక్టర్ ముఖర్జీ దేశ ప్రజలకు అసాధారణ సేవలను అందించారన్నారు.
జాతీయ సమైక్యతను, సమగ్రతను డాక్టర్ ముఖర్జీ   గట్టిగా సమర్థించారని, జమ్మూ కాశ్మీరును భారత్‌లో పూర్తి స్థాయిలో విలీనం చేయడానికి పాటుపడి ఆ క్రమంలో ప్రాణత్యాగం చేశారని ఉపరాష్ట్రపతి అన్నారు. డాక్టర్ ముఖర్జీ జీవితం, ఆదర్శాలు సశక్త, సమైక్య, స్వయంసమృద్ధ, వికసిత్ భారత్‌ను నిర్మించాలనే ఉమ్మడి ప్రయత్నాల్లో భిన్న తరాల వారికి స్ఫూర్తిని అందిస్తుంటాయని ఉపరాష్ట్రపతి అన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2281684) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Malayalam