ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పవిత్ర శ్రీ అమర్‌నాథ్ యాత్ర ఆరంభమైన వేళ శివ భక్తులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు.. సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 03 JUL 2026 3:56PM by PIB Hyderabad

పవిత్ర శ్రీ అమర్‌నాథ్ యాత్ర ఈ రోజు నుంచి మొదలైన సందర్భంగా శివ భక్తులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఆయన ఇలా పంచుకున్నారు:
‘‘వాగ్బుద్ధిచిత్తకరణౌశ్చ తపోభిరుగ్నైః
శక్యం సమాకలయితుం న యదీయరూపమ్
తం భక్తిభావసులభం శరణం నతానాం
నిత్యం భజామ్యమరరనాథమహం దయాలుమ్’’.
ఈ సుభాషితం ‘‘నేను రోజూ దయామయుడైన భగవాన్ అమర్‌నాథుడిని ఆరాధిస్తున్నాను. ఆయన స్వభావాన్ని మాటలతో, బుద్ధితో, చిత్తంతో, ఇంద్రియాలతో, లేదా పెను ధనరాశులతో అవగాహన చేసుకోవడం సాధ్యపడదు. ఆయనను భక్తి ద్వారానే సులభంగా పొందగలం. ఆయన తన సమక్షంలో ప్రణమిల్లే వారికి అభయాన్నిచ్చి కాపాడతాడు.’’ అని మనకు బోధిస్తుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
పావన-పునీత శ్రీ అమర్‌నాథ్ యాత్ర శుభారంభ వేళలో సమస్త శివభక్తులకూ అనంత శుభకామనలు. బాబా బర్ఫానీ దివ్య దర్శనాన్ని అందించే ఈ యాత్ర మీ అందరి జీవితంలో సంతోషాన్నీ, సౌభాగ్యాన్నీ, మంచి ఆరోగ్యాన్నీ అందించాలని కోరుకుంటున్నాను.
‘‘వాగ్బుద్ధిచిత్తకరణౌశ్చ తపోభిరుగ్నైః
శక్యం సమాకలయితుం న యదీయరూపమ్
తం భక్తిభావసులభం శరణం నతానాం
నిత్యం భజామ్యమరరనాథమహం దయాలుమ్’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2280791) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Malayalam