బొగ్గు మంత్రిత్వ శాఖ
ఎమ్ఎమ్‌డీఆర్ బొగ్గు బ్లాకులకు బీమా పూచీకత్తు బాండ్ల స్వీకరణ నోటిఫికేషనును జారీ చేసిన బొగ్గు శాఖ
प्रविष्टि तिथि:
02 JUL 2026 2:44PM by PIB Hyderabad
బొగ్గు బ్లాకుల కేటాయింపు పూర్తయిన సంస్థలకు మరింత ఎక్కువ ఆర్థిక సరళత్వాన్ని అందించేందుకూ, బొగ్గు రంగంలో వాణిజ్య సౌలభ్యాన్ని బలోపేతం చేసేందుకూ ఓ కీలక సంస్కరణను బొగ్గు శాఖ ప్రవేశపెట్టింది. బొగ్గు బ్లాకుల కేటాయింపు (సవరణ) నియమావళి-2026 సాయంతో మంత్రిత్వ శాఖ గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1957లో భాగంగా కేటాయించిన బొగ్గు బ్లాకులకు పనితీరు ఆధారిత బ్యాంకు గ్యారంటీల (పీబీజీ) స్థానంలో బీమా పూచీకత్తు బాండ్ల (ఐఎస్‌బీ) వినియోగానికి అవకాశాన్ని కల్పించారు.
సవరించిన ప్రాథమిక ప్రణాళిక.. బొగ్గు బ్లాకు కేటాయింపు పూర్తి అయిన వర్గాలకు తమ పనితీరు ఆధారిత సెక్యూరిటీ బాధ్యతల్ని నెరవేర్చడానికి పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ, బీమా పూచీకత్తు బాండు.. వీటిలో ఏదైనా ఒకదానిని ఎంపిక చేసుకొనేందుకు అనుమతిని ఇస్తుంది. ఈ సౌకర్యాన్ని ఇప్పటికే కేటాయింపు పూర్తి అయిన వర్గాలకు కూడా అందిస్తారు. దీంతో అవి నిర్దిష్ట షరతులకు తగినట్లు ఇప్పటికే ఇచ్చిన పనితీరు ఆధారిత బ్యాంకు గ్యారంటీలను బీమా పూచీకత్తు బాండ్లతో మార్పు చేసుకోవచ్చు.
ఈ నిర్ణయంతో సాంప్రదాయిక బ్యాంకు పూచీకత్తు ఏర్పాట్లతో ముడిపడిన ఆర్థిక భారం తగ్గుతుందన్న భావన ఉంది. అంతేకాక బొగ్గు బ్లాకు కేటాయింపు ప్రక్రియ పూర్తి అయిన వర్గాలకు బొగ్గు గని అభివృద్ధి, నిర్వహణ కార్యకలాపాల కోసం తమ మూలధనాన్ని మరింత ఎక్కువ సమర్థంగా వినియోగించడానికీ అవకాశం లభిస్తుందన్న అంచనా ఉంది. ఫలితంగా ఆర్థిక సాధనాల వరకూ చేరుకోవడాన్ని మెరుగుపరచడంలో, సముచిత పనితీరు భద్రత యంత్రాంగాల ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించడంలో తోడ్పాటు లభిస్తుంది.
బొగ్గు బ్లాకుల కేటాయింపు (సవరణ) నియమావళి-2026 ని 2026 జూన్ 22వ తేదీ నాటి భారత రాజపత్రంలో జి.ఎస్.ఆర్ 508 (ఇ) సంఖ్యతో ప్రచురించారు. దీనిని వెబ్ చిరునామా https://egazette.gov.in/(S(lymuax4zcvs2ntquyuz4zhzb))/ViewPDF.aspx లో చూడవచ్చు.
బీమా పూచీకత్తు బాండ్ల సదుపాయాన్ని తొలుత ఎమ్ఎమ్‌డీఆర్ చట్టంలో భాగంగా కేటాయింపు పూర్తి చేసిన బొగ్గు బ్లాకులకు విషయంలో మొదలుపెడతారు. బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనల) చట్టం-2015లో భాగంగా కేటాయించిన బొగ్గు బ్లాకులకు కూడా ఈ వెసులుబాటును వర్తింపచేసే ప్రక్రియను మంత్రిత్వ శాఖ చేపడుతుంది.
నియంత్రణ సంబంధిత సంస్కరణలపై బొగ్గు మంత్రిత్వ శాఖ కనబరుస్తున్న నిరంతర శ్రద్ధను ఈ కార్యక్రమం చాటి చెబుతుంది. ఈ సంస్కరణలు పెట్టుబడిని ప్రోత్సహించి, బొగ్గు బ్లాకుల కాలానుగుణ నిర్వహణను ప్రోత్సహిస్తాయి. ఈ సంస్కరణలు దేశంలో వాణిజ్య సరళిలో బొగ్గు గనుల తవ్వకాలను ఇదివరకటితో పోలిస్తే ఎక్కువ పారదర్శకంగా, సమర్థంగా తీర్చిదిద్ది ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉండే విస్తారిత అనుబంధ వ్యవస్థను ఏర్పరుస్తాయి.
***
(रिलीज़ आईडी: 2280359)
आगंतुक पटल : 15