రక్షణ మంత్రిత్వ శాఖ
భారత వైమానిక దళ ఉప ప్రధానాధికారిగా పదవీబాధ్యతలు స్వీకరించిన ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్, పీవీఎస్ఎమ్, ఏవీఎస్ఎమ్, వీఎమ్, వీఎస్ఎమ్
प्रविष्टि तिथि:
01 JUL 2026 12:59PM by PIB Hyderabad
భారత వైమానిక దళ ఉప ప్రధానాధికారిగా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్, పీవీఎస్ఎమ్, ఏవీఎస్ఎమ్, వీఎమ్, వీఎస్ఎమ్ 2026 జులై 1న పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఎయిర్ మార్షల్‌ను 1986 డిసెంబరు 6న భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పోరాట దళంలో చేరారు. ఈయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ స్టాఫ్ సర్వీస్ కాలేజీ (బంగ్లాదేశ్), నేషనల్ డిఫెన్స్ కాలేజీలో చదువుకున్నారు. 3,500 గంటల కన్న ఎక్కువ కాలం పాటు విమానాలను నడిపిన అనుభవజ్ఞుడు. మిరేజ్-2000, మిగ్ శ్రేణికి చెందిన వివిధ విమానాలు, హెచ్‌పీటీ-32, ఏఎన్-32, ఏవ్రో, కిరణ్, జాగ్వార్, ఐఎల్-78, హాక్, తేజస్ సహా అనేక రకాల విమానాలను నడిపారు. ఈయన ఎక్స్‌పెరిమెంటల్ టెస్ట్ పైలట్. అర్హత కలిగిన ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్. ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ సుమారు నాలుగు దశాబ్దాల విశిష్ట సేవాకాలంలో ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్, కోప్-ఇండియాతో పాటు ఆపరేషన్ సిందూర్ సహా అనేక కార్యకలాపాలు, అభ్యాసాలలో చురుకుగా పాల్గొన్నారు.
ఎయిర్ మార్షల్ తన శ్రేష్ఠ సైన్య వృత్తి జీవితంలో అనేక ముఖ్య ఫీల్డ్, స్టాఫ్ నియామకాలను నిర్వహించారు. కమాండింగ్ ఆఫీసర్‌గా ఆయన 9వ నంబరు స్క్వాడ్రన్‌కు సారథ్యం వహించారు. ఈ స్క్వాడ్రన్‌లో మిరేజ్-2000 విమానాలు ఉంటాయి. దీని తరువాత ఆయన పశ్చిమ సెక్టర్‌లో ఒక ఫ్రంట్‌లైన్ ఫైటర్ ఎయిర్ బేస్‌తో పాటు దక్షిణ సెక్టర్‌లో ఒక ప్రధాన ఫైటర్ ట్రయినింగ్ బేస్ పగ్గాలు చేపట్టారు. ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూలులో డైరెక్టింగ్ స్టాఫ్ గా కూడా సేవలందించారు. వైమానిక దళ ప్రధాన కేంద్రం (వాయు భవన్)లో ప్రిన్సిపల్ డైరెక్టర్ ఎయిర్ స్టాఫ్ రిక్వైర్‌మెంట్ బాధ్యతను నిర్వర్తించారు. ఎయిర్ మార్షల్ సదరన్ ఎయిర్ కమాండ్‌లో ఎయిర్ డిఫెన్స్ కమాండర్‌గా వ్యవహరించారు. వైమానిక దళ ప్రధాన కేంద్రం (వాయు భవన్)లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్రాజెక్టులు), అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ (ప్రణాళికలు), దక్షిణ పశ్చిమ ఎయిర్ కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్, వైమానిక దళ ప్రధాన కేంద్రం (వాయు భవన్)లో వైమానిక దళ ఉప ప్రధానాధికారి వంటి కీలక పదవులను కూడా నిర్వహించారు.
ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ వైమానిక దళ ఉప ప్రధానాధికారి పదవీ బాధ్యతలు స్వీకరించడాని కన్న ముందు, సెంట్రల్ ఎయిర్ కమాండుకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. ఆ తరువాత ఏకీకృత డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కేంద్రం (హెచ్‌క్యూ ఐడీఎస్)లో చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అధ్యక్షుని ఏకీకృత డిఫెన్స్ స్టాఫ్ ప్రధానాధికారి (సీఐఎస్‌సీ)గా సేవలందించారు. త్రివిధ దళాలతో ముడిపడిన ఈ కీలక బాధ్యతలను నిర్వర్తించిన కాలంలో ఆయన తన దూరదర్శి నాయకత్వ సామర్థ్యం ఆధారంగా సంయుక్తతను, ఏకీకరణను ప్రోత్సహించడానికి నిరంతరం ప్రయత్నించారు. ఆయన పదవీకాలంలో అనేక సంయుక్త సిద్ధాంతాలను, ఉత్తర్వులను జారీ చేశారు. రక్షణ దళాల సంయుక్త సామర్థ్యాన్ని దృఢతరం చేయడానికి గాను వివిధ కీలక కార్యకలాపాలకు ప్రణాళికలను రూపొందించారు.
దేశానికి ఆయన చేసిన మార్గదర్శక, విశిష్ట సేవలను గుర్తించి ఎయిర్ మార్షల్‌కు వాయు సేన పతకాన్ని 2006లో, విశిష్ట సేవ పతకాన్ని 2011లో, అతి విశిష్ట సేవ పతకాన్ని 2023లో, పరమ విశిష్ట సేవ పతకాన్ని 2026లో అందించారు.
ఎయిర్ మార్షల్ నాగేశ్ కపూర్, ఎస్‌వైఎస్ఎఖమ్, పీవీఎస్ఎమ్, ఏవీఎస్ఎమ్ నుంచి ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ భారతీయ వైమానిక దళ ఉప ప్రధానాధికారిగా పదవీబాధ్యతలను స్వీకరించారు. ఎయిర్ మార్షల్ నాగేశ్ కపూర్ 2026 జూన్ 30న దేశానికి 40 సంవత్సరాల పాటు విశిష్ట, ఉత్కృష్ట సేవలను అందించిన తరువాత పదవీ విరమణ చేశారు.


***
(रिलीज़ आईडी: 2280118)
आगंतुक पटल : 5