గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వీబీ-జీ రామ్ జీ చట్టం-2025 ద్వారా వివిధ పథకాల అనుసంధాన విధానంపై గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి అంతర మంత్రిత్వ శాఖల సంప్రదింపుల సమావేశం


ప్రభుత్వ సమగ్ర విధానంపై కీలక సమావేశంలో పాల్గొన్న 18 మంత్రిత్వ శాఖలు, విభాగాలు... జూలై 1, 2026 నుంచి అమల్లోకి వీబీ-జీ రామ్ జీ చట్టం

प्रविष्टि तिथि: 24 JUN 2026 6:48PM by PIB Hyderabad

వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్): వీబీ-జీ రామ్ జీ (వికసిత్ భారత్ జీ రామ్ జీచట్టం-2025 ద్వారా రూపొందించిన వివిధ పథకాల అనుసంధాన విధానంపై ఇవాళ జూన్ 24, 2026న న్యూఢిల్లీలోని కర్తవ్యభవన్‌లో ఉన్నత స్థాయి అంతర-మంత్రిత్వ శాఖల సంప్రదింపుల సమావేశం జరిగిందిగ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన గ్రామీణాభివృద్ధి విభాగ కార్యదర్శి శ్రీ రోహిత్ కన్సల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భారత ప్రభుత్వంలోని 18 మంత్రిత్వ శాఖలువిభాగాల ప్రతినిధులునోడల్ అధికారులు పాల్గొన్నారు.

వీబీ-జీ రామ్ జీ చట్టం జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానుందిఈ నేపథ్యంలో చేపడుతున్న సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఈ సంప్రదింపుల సమావేశం నిర్వహించారుపంచాయతీ రాజ్ సంస్థల నాయకత్వంలో గ్రామ స్థాయిలోనే ప్రణాళికలు తయారు చేయటంవివిధ ప్రభుత్వ శాఖలను అనుసంధానించటం ద్వారా గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వం ఉమ్మడిగా పనిచేయాలనే ఈ చట్టం ఆశయాన్ని అమలు చేయాలన్న అంశంపై ఈ సమావేశం దృష్టి సారించింది.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ రోహిత్ కన్సల్ మాట్లాడుతూ.. వీబీ-జీ రామ్ జీ చట్టానికి వివిధ పథకాల అనుసంధానం కీలకమని స్పష్టం చేశారుగ్రామీణాభివృద్ధిలో ఒకదానితో ఒకటి ముడిపడున్న నీటి భద్రతజీవనోపాధిమౌలిక వసతులువాతావరణ స్థిరత్వంస్థానిక ఆర్థికాభివృద్ధి వంటి ప్రాధాన్యతలను పరిష్కరించేందుకు ఇది ఎంతో కీలకమని తెలిపారు. "సింగిల్ ప్లాన్మల్టీ ఫండింగ్విధానాన్ని ఈ చట్టం ప్రతిపాదిస్తోందని పేర్కొన్నారుదీనిద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు నిధులువిధులను యథాతథంగా కొనసాగిస్తూనే.. ఒకే ఉమ్మడి అభివృద్ధి లక్ష్యం కోసం కలిసి చేసే వీలుంటుంది.

ఈ చట్టం ద్వారా రూపొందించిన వివిధ పథకాల అనుసంధాన విధానాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఈ సమావేశంలో వివరించిందిఈ కార్యాచరణ విధానంలో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (వీజీపీపీఅత్యంత కీలకమైనదిఇది పంచాయతీ స్థాయిలో గ్రామీణాభివృద్ధికి ప్రాథమిక ప్రణాళికా సాధనంగా పనిచేస్తుందిస్థానిక ప్రజల భాగస్వామ్యంతో తయారైగ్రామసభ ఆమోదం పొందే ఈ వీజీపీపీ.. స్థానిక అవసరాలను వివిధ కేంద్రరాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందుబాటులో ఉన్న వనరులునైపుణ్యాలుపెట్టుబడులతో అనుసంధానించేందుకు ప్రయత్నిస్తుంది.

ఈ కార్యాచరణ విధానం ప్రకారం ప్రణాళికలు కింద నుంచి పైస్థాయికి ఉంటాయిఇందులో గ్రామసభలు గుర్తించిన అభివృద్ధి ప్రాధాన్యతలను పంచాయతీ రాజ్ సంస్థలు ఒకచోట చేర్చివాటిని వివిధ మంత్రిత్వ శాఖలువిభాగాల పథకాలతో అనుసంధానిస్తాయిస్థానికంగా గుర్తించిన అవసరాలకే ప్రభుత్వ నిధులు వెచ్చించేలా చూడటమే ఈ విధానం ముఖ్య ఉద్దేశందీనివల్ల గ్రామాల్లో శాశ్వతమైనస్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది.

ఈ సమావేశంలో చట్టం ద్వారా నిర్దేశించిన ఇతివృత్తాల ప్రాధాన్యతలనుఅనుమతించదగిన పనుల నిబంధనలను సమీక్షించారుగ్రామీణాభివృద్ధి పనులను నాలుగు ముఖ్యమైన రంగాలుగా ఈ చట్టం విభజించిందిఅవి.. నీటి భద్రతకీలక గ్రామీణ మౌలిక వసతులుగ్రామీణ జీవనోపాధివాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించే ప్రత్యేక పనులుఈ నూతన చట్టాన్ని జూలై 1, 2026 నుంచి అమలు చేసేందుకు తాత్కాలికంగా 318 రకాల పనుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసిందిఇందులో సహజ వనరుల నిర్వహణసాగునీరుగ్రామాలకు రవాణా అనుసంధానంసామాజిక మౌలిక వసతులుజీవనోపాధికి ఆస్తుల కల్పనవాతావరణ స్థిరత్వంవిపత్తులను ఎదుర్కోవటం వంటి ముఖ్యమైన పనులున్నాయిఈ జాబితాలోని విస్తృతమైన పనుల వలన వివిధ ప్రభుత్వ శాఖలుపథకాలను అనుసంధానం చేసేందుకు మంచి అవకాశం దొరుకుతుందని సమావేశంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

సాంకేతికఆర్థిక పరమైన అనుసంధానాన్ని బలోపేతం చేయటంఅనుసంధానానికి అనువైన పథకాలను గుర్తించటం డిజిటల్ పరస్పర అనుసంధానతను పెంపొందించటంసమన్వయంతో కూడిన అమలుపర్యవేక్షణల కోసం సంస్థాగత వ్యవస్థలను ఏర్పాటు చేయటం వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘమైన చర్చలు జరిగాయిసమావేశంలో పాల్గొన్న వివిధ మంత్రిత్వ శాఖలువిభాగాల ప్రతినిధులు ఈ ముసాయిదా కార్యాచరణ విధానంపై అభిప్రాయాలనుసూచనలను పంచుకున్నారు.

ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ (గ్రామీణ ఉపాధిశ్రీమతి రోహిణి భాజీభాకరేడిప్యూటీ సెక్రటరీ (గ్రామీణ ఉపాధిశ్రీ ఆశిష్ గుప్తామంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వీబీ-జీ రామ్ జీ చట్టం అమలుతో పాటుగా వివిధ పథకాల అనుసంధాన విధానాన్ని కూడా జూలై 1, 2026 నుంచి ఆచరణలోకి తీసుకురావాలని ప్రతిపాదించారుఇది గ్రామస్థాయిలోనే ప్రణాళికలను బలోపేతం చేస్తుందనిప్రభుత్వ పెట్టుబడులను సద్వినియోగం చేస్తుందని.. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు కలిసి పనిచేయటం వల్ల గ్రామాల సమగ్రాభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆశిస్తున్నారు.

***


(रिलीज़ आईडी: 2277671) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Marathi , English , Urdu , हिन्दी , Gujarati , Tamil