యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ ఏకతను పెంపొందించడానికి దేశమంతటా ‘వందే మాతరం శిబిరాలు’ నిర్వహించనున్న మై భారత్

భారతదేశ రాజ్యాంగ, ప్రజాస్వామిక సంప్రదాయాలపై అవగాహనను పెంచుకొనే అవకాశాల్ని యువతకు అందించనున్న శిబిరాలు
కోల్‌కతాలో ఈ నెల 24 నుంచి 30 వరకూ మొదటి శిబిరం

प्रविष्टि तिथि: 23 JUN 2026 4:17PM by PIB Hyderabad

దేశ వ్యాప్తంగా వందే మాతరం శిబిరాలను కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన యువజన వ్యవహారాల విభాగం ‘మై భారత్’ (MY Bharat) సహకారంతో నిర్వహించనుంది. మొదటి శిబిరాన్ని బంకిమ్ చంద్ర చటర్జీ జయంతి సందర్భంగా 2026 జూన్ 24నుంచి 30 వరకు కోల్‌కతాలో ఏర్పాటు చేయనున్నారు. జాతీయ ఏకత, రాజ్యాంగ విలువలతో పాటు యువజన నాయకత్వాన్ని పటిష్ఠపరిచే ఉద్దేశంతో చేపడుతున్న ప్రధాన యువజన సమీకరణ కార్యక్రమమిది.
ఏడు రోజుల పాటు కొనసాగించే ఈ శిబిరాల్లో భారత రాజ్యాంగ, ప్రజాస్వామిక సంప్రదాయాల పట్ల యువజనుల్లో అవగాహనను విస్తృతం చేసే అవకాశాలను అందిస్తారు. సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని, పౌర బాధ్యతను పెంపొందింపచేస్తారు. 2047 కల్లా ‘వికసిత్ భారత్‌’ దిశగా అడుగులు వేసేటట్లు విషయాలపై అవగాహనను పెంచుకొనే, బాధ్యత కలిగి నడుచుకొనే, దేశానికి పనికివచ్చే యువ నాయకుల తరాన్ని పెంచి పోషించడమే ఈ శిబిరాల ప్రధానోద్దేశం.
మాతృభూమి పట్ల గౌరవభావనను ప్రోత్సహిస్తూ ప్రాంతీయ, భాషా, సామాజిక సరిహద్దులకు అతీతంగా భావనాత్మక ఏకీకరణకు ప్రతీకగా ‘వందే మాతరం’ నిలిచింది. ‘వందే మాతరం’ భావన నుంచి స్ఫూర్తిని వందే మాతరం శిబిరాలు తీసుకుంటున్నాయి. ఈ కార్యక్రమం పౌరుల భాగస్వామ్యాన్ని, నాయకత్వాన్ని తీర్చిదిద్దడం, డిజిటల్ మాధ్యమాల వినియోగంపై పట్టును పెంపొందించడం, సామాజిక బాధ్యతలతో పాటు ఉమ్మడి భాతస్వామ్యాన్ని కూడా పెంచి సమకాలీన యువత సమస్యలకు పరిష్కారాలను అందించదలుస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన జిల్లాల్లో 20 శిబిరాలను ఏర్పాటు చేస్తారు. వాటిలో ప్రతి  శిబిరంలో 15 ఏళ్లు- 29 ఏళ్ల వయసున్న 150 మంది యువతను తీసుకుంటారు. ప్రతి శిబిరంలో 6 రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యాన్ని కల్పిస్తారు. మహిళలు, సామాజికంగా మోసానికి గురైన వర్గాలకు కనీసం 50 శాతం భాగస్వామ్యం ఉంటుంది. ఈ శిబిరాల్లో దాదాపు 3,000 యువతను చేర్చుకుంటారు. రాజ్యాంగ విలువలు, సాంస్కృతిక మార్పిడి మొదలు నాయకత్వాన్ని తీర్చిదిద్దడం, ప్రధాన పథకాల వరకూ అనేక అంశాలను ఈ శిబిరాల్లో ప్రస్తావిస్తారు.
వారం పొడవునా సాగే శిబిరాల్లో.. వందే మాతరానికి ఉన్న చరిత్రాత్మక ప్రాధాన్యాన్ని, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం పోషించిన పాత్రను వివరిస్తారు. రాజ్యాంగం, పౌరుల కర్తవ్యాలకు సంబంధించిన కార్యక్రమాలు, భాష, భోజనం, క్రీడల మాధ్యమాల ద్వారా సాంస్కృతిక ఆదాన, ప్రదానం, చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాల్లో పర్యటనలు, ‘దేశమే ప్రథమం’ అంశంపై చర్చలు ఉంటాయి. తాత్కాలిక ఉపన్యాస కార్యక్రమాలు, నాయకత్వం, ప్రజాసమీకరణ వర్క్‌షాపులతో పాటు ప్రభుత్వ ప్రధాన పథకాలపై కూడా చర్చలు చోటుచేసుకొంటాయి.
భారత యువత శక్తిని, ఆదర్శవాదాన్ని, సృజనాత్మకతను ఉపయోగించుకొంటూ ఏకత, రాజ్యాంగ విలువలతో పాటు దేశాన్ని తీర్చిదిద్దాలన్న ఆదర్శాల్ని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ ఎంతగా నిబద్ధమై ఉన్నదీ వందే మాతరం శిబిరాలు పునరుద్ఘాటిస్తాయి.

***


(रिलीज़ आईडी: 2277104) आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam