ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రిపబ్లిక్ సమ్మిట్-2026 ప్రసంగ ముఖ్యాంశాలు పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 22 JUN 2026 10:51PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ సమిట్-2026లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ అనేక సందేశాలను పొందుపరుస్తూ:
‘‘ప్రజలు వెళ్లడానికైనా సరే భయపడే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, మేం ‘దేశానికే ప్రాధాన్యం’ అనే భావనతో అభివృద్ధి సాధనకు సంకల్పాన్ని చెప్పుకొని, ముందుకు పోతున్నాం. దీని ఫలితంగా ప్రస్తుతం దేశంలో మావోవాదుల బీభత్సకాండ ఆఖరి అధ్యాయానికి చేరింది.’’

‘‘సేవలో గత 12 సంవత్సరాల కాలంలో మా మరొక పెద్ద కానుక ఏమిటంటే నిరాశ నుంచి బయటపడి ఆశాజనక భారత్‌ను, ఆకాంక్షలు పొంగిపొరలుతున్న భారత్‌ను నిర్మిస్తుండటం!’’
‘‘ మధ్యతరగతి ప్రజానీకం ఎప్పుడూ మాకు ప్రధాన ప్రాధాన్యమే. ఆ వర్గానికి జీవన సౌలభ్యాన్ని అందించడం కోసం ప్రభుత్వం అన్ని స్థాయుల్లో కృషి చేసింది.’’ 
‘‘భారత్ అభివృద్ధి దిశగా సాగుతున్న ఈ ముఖ్య తరుణంలో, చెడ్డ వాదనలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం’’ అని పేర్కొన్నారు.
 
***

(రిలీజ్ ఐడి: 2277082) సందర్శకుల సూచీ సంఖ్య : : 57
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada