ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రజా విశ్వాసం, సుపరిపాలనపై వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 22 JUN 2026 2:22PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

సుపరిపాలనకు  ప్రజా విశ్వాసమే అతిపెద్ద మూలధనమని ఈ వ్యాసం పేర్కొంది. గత 12 ఏళ్లలో దేశంలో వచ్చిన మార్పులు.. పరిపాలనపై ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేయడమే కాకుండావివిధ సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మంది పౌరుల జీవితాలను మరింత సులభతరంసురక్షితంగౌరవప్రదంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయని ఇందులో వివరించారు. ఈ అభివృద్ధి పరిణామాలుపౌరులపై వాటి ప్రభావం గురించి ఈ వ్యాసం తెలియజేస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘ప్రజా విశ్వాసమే సుపరిపాలనకు అత్యంత పెద్ద మూలధనం. గత 12 సంవత్సరాల్లో వచ్చిన మార్పులు పరిపాలన పట్ల ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేయడంలో విజయవంతం అవ్వడమే కాకుండాప్రజా సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది పౌరుల జీవితాలను మరింత సులభతరంగాసురక్షితంగాగౌరవప్రదంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ వ్యాసంలో తన అభిప్రాయాలను వివరంగా పంచుకున్నారు’‘.


(रिलीज़ आईडी: 2276635) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Malayalam