రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026: షిల్లాంగ్‌లోని వైమానిక దళ తూర్పు కమాండ్‌లో 1,000 మంది సైనికులతో కలసి యోగా సాధన చేసిన రక్షణ మంత్రి


ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు, బలమైన దేశం కోసం దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపు

प्रविष्टि तिथि: 21 JUN 2026 12:01PM by PIB Hyderabad

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)ను పురస్కరించుకుని 2026 జూన్ 21న మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఉన్న వైమానిక దళ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయంలో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారుఈ సందర్భంగా భారత వైమానిక దళంభారత సైన్యానికి చెందిన సుమారు 1,000 మంది సైనికులతో కలిసి రక్షణ మంత్రి వివిధ ఆసనాలుశ్వాస వ్యాయామాలు చేశారురక్షణ మంత్రితో పాటు మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కాన్రాడ్ కె సంగ్మావైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్వైమానిక దళ తూర్పు కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ అధికారి ఎయిర్ మార్షల్ ఇందర్‌పాల్ సింగ్ వాలియాహెడ్‌క్వార్టర్స్ 101 ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ మోహిత్ వాధ్వా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

 

ఈ సందర్భంగా రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విలేకరులతో మాట్లాడారుయోగాను సమగ్రమైన శాస్త్రంగా వర్ణించారువ్యక్తులను వారి అంతరాత్మతోసమాజంతోప్రకృతితోఅంతిమంగా దైవత్వంతో అనుసంధానించే ఒక జీవన విధానమని అన్నారుమానసిక స్థిరత్వానికీస్పష్టతకూభావోద్వేగ దృఢత్వానికీ మార్గాన్ని చూపిస్తుందని ఆయన తెలియజేశారు.

ప్రపంచ స్థాయి ఉద్యమంగా యోగా మారడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన కృషిఆయనకున్న దార్శనికతే కారణమని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారుయోగా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నారని తెలిపారుభారతదేశ ప్రాచీన సంప్రదాయాల శక్తికి యోగా ప్రతీక అనీఇది మానవాళికి శ్రేయస్సును అందిస్తుందనీ స్పష్టం చేశారుఆరోగ్యవంతమైన శరీరాన్నీప్రశాంతమైన మనస్సునూబలమైన దేశాన్నీ సాధించేందుకు తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా మార్చుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా పశ్చిమ బెంగాల్లోని కోల్‌కతాలో చారిత్రక రెడ్ రోడ్ నుంచి ప్రధానమంత్రి ఐడీవై ప్రసంగాన్ని వీక్షించారురక్షణ దళాల సిబ్బందికున్న అంకితభావాన్నీఉత్సాహాన్నీ ప్రతిబింబిస్తూపలు సరిహద్దు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాంచీ విశ్వవిద్యాలయంలోని స్వర్ణ జయంతి దీక్షాంత్ మండపంలో జరిగిన వేడుకల్లో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ పాల్గొన్నారుసానుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఉండటాన్ని యోగా నేర్పుతుందనీఅందుకే దీనిని దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందనీ ఆయన స్పష్టం చేశారుఅంతర్గతంగా సానుకూలతను పెంపొందించుకోవడానికి అత్యంత శక్తివంతమైన మాధ్యమంగా యోగాను ఆయన వర్ణించారు.


 

image.png

న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద సమీకృత రక్షణ సిబ్బంది ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవాలకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి నాయకత్వం వహించారుచీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌కు చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఉన్న ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులువారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

image.png

న్యూఢిల్లీలోని సీజీడీఏ కార్యాయలంలో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారురక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్కార్యదర్శి (రక్షణ ఆర్థిక విభాగంశ్రీ విశ్వజిత్ సహాయ్కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (సీజీడీఏశ్రీ అనుగ్రహ నారాయణ దాస్‌తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖరక్షణ అకౌంట్ల విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ఆరోగ్యవంతమైన ఆయుష్షు కోసం యోగా’’ అనే ఇతివృత్తంతో ఈ ఐడీవై-2026 నిర్వహిస్తున్నారుయోగానుసమగ్ర ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా డిఫెన్స్ అకౌంట్స్ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 10,000 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు.

 

 

***


(रिलीज़ आईडी: 2276416) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil