బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంయుక్తంగా నిర్వహించిన బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖలు

प्रविष्टि तिथि: 21 JUN 2026 2:01PM by PIB Hyderabad

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖగనుల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఉత్సాహంగాభారీ భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాయిన్యూఢిల్లీలోని నేతాజీ నగర్ జీపీఓఏ-3 వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారుమంత్రిత్వ శాఖల అధికారులుసిబ్బందిలో సంపూర్ణ ఆరోగ్యంమానసిక ఉల్లాసంఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ వేడుక మరోసారి చాటిచెప్పిందిఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తమైన ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’కు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో గనుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ వీణా కుమారి డెర్మల్బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ కాసితో పాటు రెండు మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులుసిబ్బంది పాల్గొన్నారు.. వీరంతా ఎంతో ఉత్సాహంతో 2026 యోగా దినోత్సవ వేడుకల్లో భాగస్వాములై యోగాసనాలు వేశారు.

న్యూఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా కేంద్రానికి చెందిన యోగా నిపుణులు శ్రీమతి నిషు భందులా అరోరాశ్రీమతి నిషితలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారుశారీరక దృఢత్వాన్ని పెంపొందించడంశరీర సౌలభ్యాన్ని మెరుగుపరచడంమానసిక స్థైర్యాన్ని బలోపేతం చేయడంసంపూర్ణ శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో.. పాల్గొన్న వారందరికీ యోగా గురువులు వివిధ ఆసనాలుప్రాణాయామంధ్యాన పద్దతులను నేర్పించారు.

ఈ సందర్భంగా గనుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ వీణా కుమారి డెర్మల్ మాట్లాడుతూ.. యోగాను రోజువారీ జీవితంలో ఒక అంతర్భాగంగా మార్చుకోవాల్సిన అవసరముందని చెప్పారుముఖ్యంగా కార్యాలయాల్లో గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగులు,అధికారులు యోగాను రోజువారీ అలవాటుగా మార్చుకోవాలని కోరారుకార్యాలయాల్లో ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల శారీరకమానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని.. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల కూర్చునే విధానం మెరుగవుతుందనిఒత్తిడి తగ్గుతుందనిఏకాగ్రత పెరుగడంతోపాటు మొత్తం ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారుమరింత ఆరోగ్యకరమైనసమతుల్యమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొన్ని నిమిషాల సమయాన్ని యోగాకు కేటాయించాలని ప్రోత్సహించారు.

కార్యక్రమ ముగింపు ప్రసంగంలో బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ కాసి మాట్లాడుతూ.. ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఉద్యోగులుఅధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు.  యోగా శిక్షకులునిర్వాహకుల కృషిని అభినందించారుయోగా కేవలం ఒక్క రోజు జరుపుకునే వేడుక మాత్రమే కాదనిశరీరాన్నిమనసును బలోపేతం చేసే జీవితకాల సాధనగా పేర్కొన్నారుప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడమే కాకుండాఇతరులు కూడా దీనిని అనుసరించేలా ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రెండు మంత్రిత్వ శాఖల అధికారులుసిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని చాటారువృత్తిపరమైనవ్యక్తిగత జీవితంలో ఆరోగ్యాన్ని ఒక అంతర్భాగంగా మార్చుకోవాలనే వారి నిబద్ధతకు ఇది అద్దం పట్టిందిఅందరూ కలిసికట్టుగా యోగా సాధన చేయడం వల్ల పాల్గొన్న వారిలో ఐక్యతక్రమశిక్షణఏకాగ్రత పెంపొందాయి.

ఈ వేడుకలు ముందస్తు ఆరోగ్య రక్షణపని ప్రదేశంలో శ్రేయస్సుఆరోగ్యకరమైనఉత్పాదకత గల సిబ్బందిని తయారు చేయాలనే ఉద్దేశంతో బొగ్గుగనుల మంత్రిత్వ శాఖల ఉమ్మడి నిబద్ధతను చాటిచెప్పాయిసంపూర్ణ ఆరోగ్యంశాశ్వత శ్రేయస్సును సాధించడానికి యోగాను రోజువారీ అలవాటుగా మార్చుకోవాలనే ప్రాధాన్యతను ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేసింది.

***


(रिलीज़ आईडी: 2276413) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil