ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడు... తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి ప్రగాఢ సంతాపం
प्रविष्टि तिथि:
21 JUN 2026 10:08PM by PIB Hyderabad
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
"తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించిందని తెలిసి తీవ్రంగా విచారించాను. ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2276401)
आगंतुक पटल : 34
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam