రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కోల్‌కతాలో మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించనున్న భారత నావికాదళం

प्रविष्टि तिथि: 19 JUN 2026 4:57PM by PIB Hyderabad

భారత నావికాదళం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు అత్యాధునిక నౌకలైన ‘దూనగిరిసంశోధక్అగ్రే’లను 2026 జూన్ 21న కోల్‌కతాలో అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశపెట్టనుంది

ఈ చారిత్రాత్మక రక్షణ రంగ కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరుకానున్నారు. (https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2275033&reg=3&lang=1

భారత నావికాదళానికి చెందిన 'వార్‌షిప్ డిజైన్ బ్యూరోరూపొందించిన ఈ నౌకలను కోల్‌కతాలోని 'గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ఇంజనీర్స్' (జీఆర్ఎస్‌ఈనిర్మించిందిఇవి సముద్ర యుద్ధక్షేత్రంసముద్ర జలాల సర్వేజలాంతర్గామి నిరోధక విభాగాల్లో కీలకమైన కార్యాచరణ సామర్థ్యాలను కలిగి ఉన్నాయిఇవన్నీ కలిసి సామర్థ్య పెంపుసముద్ర జలాల్లో కార్యకలాపాలను బలోపేతం చేయటంసముద్రయానం విషయంలో అవగాహనను పెంచటంఎదురవుతున్న ముప్పుల నుంచి తీరప్రాంత జలాలను రక్షించడానికి నౌకాదళం అవలంబిస్తోన్న సమతుల్య విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి

ప్రాజెక్ట్ 17ఏ శ్రేణిలో ఐదో 'శత్రువుల రాడార్లకు చిక్కని యుద్ధనౌక (స్టెల్త్ ఫ్రిగేట్)’ అయిన 'దూనగిరి'.. అత్యాధునిక ఆయుధాలుసెన్సార్లను కలిగి ఉందిఇందులో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులుమధ్యస్థ శ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు ఉన్నాయిఇవి నౌకాదళం పోరాట సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి.

నాలుగో ‘పెద్ద సర్వే నౌక’ అయిన ‘సంశోధక్’ను తీరప్రాంతలోతైన సముద్ర జలాల హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం రూపొందించారురక్షణపౌర అవసరాల కోసం సముద్ర శాస్త్రభూభౌతిక డేటాను సేకరించడానికి ఇది ఉపయోగపడుతుందిఇది స్వయంప్రతిపత్తి గల జలాంతర వాహనాలురిమోట్ పద్ధతిలో నడిపే వాహనాలు (ఆర్ఓవీవంటి అత్యాధునిక సర్వే వ్యవస్థలను కలిగి ఉంది.

అర్నాలా శ్రేణికి చెందిన తక్కువ లోతు జలాల్లో జలాంతర్గామి నిరోధక నౌకలలో నాలుగోదైన 'అగ్రే'.. తేలికపాటి టార్పెడోలుస్వదేశీ రాకెట్ లాంచర్లుతక్కువ లోతు జలాల సోనార్ వ్యవస్థలను కలిగి ఉందిఇది తీరప్రాంత జలాల్లో నీటి అడుగున ఉండే ముప్పులను గుర్తించి వాటిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

భారత స్వదేశీ నౌకా నిర్మాణ రంగం పరిణతి చెందిన తీరును ఈ మూడు యుద్ధనౌకలు తెలియజేస్తున్నాయిఈ నౌకల నిర్మాణంలో 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానం లేదా పరికరాలను ఉపయోగించారువీటి నిర్మాణ ప్రక్రియలో 200కు పైగా ఎంఎస్ఎంఈలతో సహా దేశీయ పరిశ్రమలు విస్తృతంగా భాగస్వామ్యమయ్యాయిఇది దేశంలో ప్రత్యక్షంగానూపరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించింది.

ఈ యుద్ధనౌకలను నావికాదళంలోకి చేర్చడం..  'ఆత్మనిర్భర్ భారత్'  లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలోభారత సముద్ర రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వంనావికాదళంప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థలుప్రైవేట్ పరిశ్రమలుఎంఎస్ఎంఈల ఉమ్మడి కృషీసహకారానికీ ఒక అద్భుతమైన నిదర్శనంగా ఉంది

 

***


(रिलीज़ आईडी: 2276069) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil