ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జ్ఞానం, వివేకం, దూరదృష్టిల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 19 JUN 2026 8:15AM by PIB Hyderabad

జ్ఞానంవివేకందూరదృష్టి.. ఈ గుణాలు మనిషి జీవితంలో విజయానికి మూలస్తంభాలని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారుఈ గుణాలను అలవరుచుకున్న వ్యక్తులు అత్యంత కఠిన సవాళ్లను కూడా అధిగమించి విజేతలుగా నిలుస్తారని ప్రధాని తెలిపారు.
‘‘
శాస్త్రే ప్రతిష్ఠా సహజశ్చ బోధః ప్రాగల్భ్యమభ్యస్తగుణా చ వాణీకాలానురోధః ప్రతిభానవత్త్వమేతే గుణాః కామదుఘాః క్రియాసు’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.

ఏదైనా విషయం పట్ల ప్రామాణిక జ్ఞానంస్వాభావిక వివేకంభయానికి తావివ్వని ఆత్మవిశ్వాసంఅభ్యాసంతో సాధించిన వాగ్ధాటికాలానుగుణ అవసరాల్ని గుర్తించే ముందుచూపుతో పాటు ఏ పనినైనా లోతుగా ఆలోచించి మరీ చేస్తూ ఉండే తత్వం.. ఈ ఆరు గుణాలూ మనిషికి ప్రతి పనిలోనూ ‘కామధేనువు’లాగా తోడ్పడిప్రతి లక్ష్యాన్నీ సాధించుకోవడంలో సహకరిస్తాయని ఈ సుభాషితం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘
జ్ఞానంవివేకందూరదృష్టి వంటి సద్గుణాలు మనిషి జీవితంలో సాఫల్యానికి మూలాధారాలువీటిని అలవరుచుకున్న వ్యక్తులు కఠిన సవాళ్లనైనా పరిష్కరించుకోగలిగి విజేతలుగా నిలుస్తారు.
‘‘
శాస్త్రే ప్రతిష్ఠా సహజశ్చ బోధః ప్రాగల్భ్యమభ్యస్తగుణా చ వాణీ
కాలానురోధః ప్రతిభానత్త్వమేతే గుణాః కామదుఘాః క్రియాసు’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2275215) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam