ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బయోమెట్రిక్ ఎస్‌డీకే బెంచ్‌మార్కింగ్ పోటీని విజయవంతంగా నిర్వహించిన యూఐడీఏఐ.. విజేతల ప్రకటన

प्रविष्टि तिथि: 15 JUN 2026 7:05PM by PIB Hyderabad

ముఖానికీకనుపాప విధానాలకు సంబంధించిన బయోమెట్రిక్ ఎస్‌డీకే బెంచ్‌మార్కింగ్ పోటీ విజేతలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐహైదరాబాద్‌లోని ఇంటర్‌నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (ఐఐఐటీ హైదరాబాద్సహకారంతో సోమవారం నాడు సత్కరించింది.

ఫింగర్‌ప్రింట్ పోటీ విజయవంతం అయిన నేపథ్యంలోయూఐడీఏఐ 2025 డిసెంబరు, 2026 ఫిబ్రవరి మధ్య కాలంలో ముఖంకనుపాప వయసు తేడాపై పోటీలను నిర్వహించిందిముఖంకంటిపాప పోటీల్లో పాల్గొనడానికి మొత్తం 531 సంస్థలు ముందుకు వచ్చి నమోదు ప్రక్రియను పూర్తి చేశాయి.

సమగ్ర పరీక్షలుపనితీరును పరిశీలించిన తరువాతముఖాకృతి పోటీలో అగ్రస్థానాన్ని స్లొవేకియాకు చెందిన ఇన్నొవేట్రిక్స్ చేజిక్కించుకొందితరువాతి స్థానాలలో అమెరికాకు చెందిన ఐడీబీఐఓలిథువేనియాకు చెందిన న్యూరోటెక్నాలజీ నిలిచాయిఇదే విధంగా ఐరిస్ ఛాలెంజ్‌లో ప్రథమ స్థానాన్ని ఐడీబీఐఓ దక్కించుకుందితరువాతి స్థానాలలో న్యూరోటెక్నాలజీఇన్నొవేట్రిక్స్ నిలిచాయి.

ఈ పోటీలో విజేతలే కాకుండా పర్ఫియోస్ఊరూ సంస్థలతోపాటు ఐఐఐటీ హైదరాబాద్ సహా అనేక భారతీయ కంపెనీలువిద్యాసంస్థలు కూడా పాల్గొన్నాయి.

దేశీయ బయోమెట్రిక్ ఎస్‌డీకే సంబంధిత పరిష్కారాలను రూపొందించేబయోమెట్రిక్ పరిశోధనలను ప్రోత్సహించే దిశగా యూఐడీఏఐ చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో ఈ కార్యక్రమం ఓ భాగంభారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన అగ్రగామి సాంకేతిక సేవా ప్రదాతలకూపరిశోధన సంస్థలకూ చెందిన ఉన్నత పనితీరును కనబరిచే 1:1 ముఖంకనుపాపలతో పోలిక కలిగిన పరిష్కారాల్ని గుర్తించడమే ఫేస్ఐరిస్ పోటీల నిర్వహణలో ముఖ్యోద్దేశం.

పెద్దవైనపేర్లు లేని డేటా సెట్లను ఉపయోగించి మూల్యాంకనాల్ని చేపట్టారుమనిషి వయసు క్రమంగా పెరుగుతుండే దశలో ఈ సరిచూసే వ్యవస్థలు ఎంత ప్రభావవంతంగా పనిచేయగలిగేదీ పరీక్షించడానికే ఈ పోటీల్ని నిర్వహించారుఇందుకోసం ఏళ్ల నుంచి 10 ఏళ్ల వయసు బాలల విశిష్ట దీర్ఘకాలిక బయోమెట్రిక్ డేటాసెట్లను ఉపయోగించారుఇదే ఈ పోటీల్లోని ప్రత్యేకతప్రతి ఒక్క నమూనాకీ మధ్య సంవత్సరాల అంతరం ఉండేటట్లు జాగ్రత్త తీసుకున్నారు.

యూఐడీఏఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీ అంతర్జాతీయ స్థాయిలో ఒక విశిష్టమైనదని చెప్పవచ్చువివిధ వయో వర్గాల బాలల బయోమెట్రిక్ గుర్తింపునకు సంబంధించి వాస్తవిక ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఈ విధమైన డేటా సెట్లను ఉపయోగించుకున్నారు.

బయోమెట్రిక్ విస్తారిత అనుబంధ వ్యవస్థ నుంచి నిరంతర ప్రాతిపదికన నూతన ఆవిష్కరణలనూభాగస్వామ్యాన్నీ ప్రోత్సహించే ఉద్దేశంతో యూఐడీఏఐ అగ్రగామి పనితీరును కనబరుస్తున్న భాగస్వాములను గుర్తించి సత్కరించిందిఈ పోటీల్లో పాల్గొన్న భాగస్వాములందరూ చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలను యూఐడీఏఐ ప్రోత్సహించింది.

మరింత సమాచారం ఇక్కడ..

https://biochallenge.uidai.gov.in

 

***


(रिलीज़ आईडी: 2273576) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil