సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏఎస్ఐ, డెన్మార్క్ జాతీయ మ్యూజియం మధ్య ఒప్పందం నీట మునిగిన చారిత్రిక డేనిష్ నౌక అరాసండ్‌ పై పరిశోధనలు

प्रविष्टि तिथि: 15 JUN 2026 8:07PM by PIB Hyderabad

భారత పురాతత్వ సర్వే సంస్థ (ఏఎస్ఐ)తో పాటు కోపెన్‌హాగెన్‌లోని డెన్మార్క్ జాతీయ పురావస్తుశాలకు చెందిన ‘ఎన్‌జోర్డ్ సెంటర్ ఫర్ మారిటైం అండ్ అండర్‌ వాటర్ కల్చరల్ హెరిటేజ్’ ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎమ్ఓయూకుదుర్చుకున్నాయిసముద్ర జలాల్లో మునిగిపోయిన చరిత్రాత్మక డేనిష్ నౌక అరాసండ్ అవశేషాలను కలిసికట్టుగా వెదికివాటి జాబితాను రూపొందించడానికి సముద్ర జలాల్లో పురావస్తు ప్రాజెక్టు నిర్వహణకు ఈ ఒప్పందం దోహదపడుతుందిఅరాసండ్ క్రీ.. 1619లో పుదుచ్చేరిలోని కరైకల్ తీర సమీపంలో ఓ దుర్ఘటన కారణంగా సముద్ర జలాల్లో మునిగింది.

భారత్‌కు చేరిన మొదటి డేనిష్ నౌకగా అరాసండ్‌‌‌కు నౌకావాణిజ్య చరిత్రలో ఒక చెప్పుకోదగ్గ స్థానం ఉందిఇది భారతీయ జలాల్లోకి ప్రవేశించిన కొద్దిసేపటిలోనేకరైకల్ సమీపాన ప్రమాదానికి లోనైందిఈ కారణంగా డెన్మార్క్భారత్‌ మధ్య ప్రాథమిక నౌకావాణిజ్య సంబంధాలు, 17వ శతాబ్దం మొదట్లో హిందూ మహాసముద్రంలో నౌకల రాకపోకలతో పాటు వాణిజ్యంతో ముడిపడిన విస్తృత చరిత్రపై అవగాహనను పెంచుకోవడానికి పురాతత్వ పరంగా ఇది ఒక ప్రధాన వనరుగా మారింది.

ఎమ్ఓయూ షరతుల్లో పేర్కొన్న ప్రకారం.. నౌక శిథిలాల్లో మిగిలి ఉంటాయని భావిస్తున్న సామగ్రిని అన్వేషించడానికి ఆధునిక సాంకేతికతలతో పాటు శాస్త్రీయ పద్ధతులను కూడా ఉపయోగించి బహిర్గత పురావస్తు సర్వేపై ఈ ప్రాజెక్టు దృష్టిని కేంద్రీకరిస్తుందిఈ అన్వేషణను భారతీయ పురాతత్వ సర్వే సంస్థకు చెందిన అండర్‌వాటర్ ఆర్కియాలజీ వింగ్ ఆధ్వర్యంలో డెన్మార్క్‌కు చెందిన జాతీయ మ్యూజియం సహకారంతో చేపడతారు.

ఈ సహకారం అండర్‌వాటర్ ఆర్కియాలజీ వింగ్‌కు సంబంధించినంత వరకు ఒక ప్రధాన ప్రస్థానమని చెప్పవచ్చుఓ అంతర్జాతీయ సంస్థతో కలిసి ఈ సంస్థ చేపడుతున్న మొదటి సంయుక్త పురావస్తు ప్రాజెక్టు ఇదిభారత్డెన్మార్క్ మధ్య అండర్‌ వాటర్ కల్చరల్ హెరిటేజ్‌తో ముడిపడిన పరిశోధన రంగంలో విద్యావిజ్ఞానశాస్త్ర సహకారం ఈ భాగస్వామ్యంతో బలోపేతమవుతుందిఅంతర్జాతీయ సహకారంతో పాటు నీటి లోపలికి వెళ్లకుండా శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి సాంస్కృతిక వారసత్వాన్ని గ్రంథస్తం చేయడంసంరక్షించడంఅధ్యయనం చేయడం పట్ల రెండు సంస్థలకూ ఉన్న ఉమ్మడి ఆసక్తిని కూడా ఈ కార్యక్రమం చాటిచెబుతుంది.

 

***


(रिलीज़ आईडी: 2273467) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Malayalam