ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్లోవాక్ పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి సమావేశం

प्रविष्टि तिथि: 15 JUN 2026 9:14PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధానమంత్రి గౌరవనీయ రాబర్ట్ ఫికోతో కలిసి ఇవాళ ఆ దేశంలోని ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో సమావేశమయ్యారు. రైల్వే, రక్షణ, ఆటోమోటివ్స్, ఇంధనం, ఐటీ, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారత్, స్లోవేకియాల మధ్య విస్తరిస్తున్న వాణిజ్య-వ్యాపార సంబంధాలపై ప్రధానమంత్రి హర్షం ప్రకటించారు. వాణిజ్య సౌలభ్యం, పారదర్శక-సుస్థిర, పెట్టుబడిదారు అనుకూల ఆర్థిక పరిస్థితుల కల్పన దిశగా భారత్‌ ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన ప్రధాన సంస్కరణలు, విధానపరమైన కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో ప్రధానంగా మౌలిక సదుపాయాలు, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ ఆవిష్కరణలు, సెమీకండక్టర్లు, ఏఐ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో నానాటికీ పెరుగుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని స్లోవాక్ కంపెనీలను ఆయన ఆహ్వానించారు.

వికసిత భారత్ దిశగా చేపట్టిన సంస్కరణలను స్లోవాక్‌ పారిశ్రామికవేత్తలు స్వాగతించడంతోపాటు దేశ ఆర్థిక ప్రగతిపై విశ్వాసం వెలిబుచ్చారు. మెరుగైన పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, భారతీయ సంస్థలతో సంయుక్త వాణిజ్య భాగస్వామ్యాల ద్వారా దేశంలో తమ పరిశ్రమల మనుగడను బలోపేతం చేసుకోవడంపై వారు ఆసక్తి వ్యక్తం చేశారు. భారత్-ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఇది అమలులోకి రావడం వల్ల తమకు కొత్త వ్యాపార అవకాశాలు అందివస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పరిశ్రమల అధిపతులు/సీఈవోలు హాజరయ్యారు.

·        శ్రీ అలెక్సీ బల్జాయెవ్, చైర్మన్, టాట్రావగొంకా

·        శ్రీ పీటర్ మాలెక్, వైస్-చైర్మన్, టాట్రావగొంకా

·        శ్రీ రాబర్ట్ స్పిసాక్, చైర్మన్, ఏజెడ్‌సీ గ్రూప్

·        శ్రీ రిచర్డ్ మార్కో, సీఈవో, ఈఎస్‌ఈటీ

·        శ్రీ పర్విందర్ వాలియా, ఆసియా-పసిఫిక్ ప్రాంత ప్రెసిడెంట్, ఈఎస్‌ఈటీ

·        శ్రీ జరోస్లావ్ కురాసినా, సీఈవో, గ్రాండ్ పవర్ లిమిటెడ్

·        శ్రీ పీటర్ లెడ్నికీ, సీఈవో, పెంటా హాస్పిటల్స్ ఇంటర్నేషనల్

·        శ్రీ స్టీఫన్ రోసినా, సీఈవో, మెటాడోర్

·        శ్రీ రాజేష్ సబ్నే, మేనేజింగ్ డైరెక్టర్-సీఈవో, మెటాడోర్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

·        మిస్టర్ మాటేజ్ కోరెక్, జనరల్ డైరెక్టర్, వీయూజేఈ, ఎ.ఎస్‌.

·        మిస్టర్ పీటర్ డుచోవిక్, సీఈవో , వీఐపీవో

·        మిస్టర్ ఆండ్రేజ్ బెన్సెల్, హెడ్ ఆఫ్ డిజిటల్ కాంపిటెన్స్, వీఐపీవో

·        మిస్టర్ జోజెఫ్ ఒమెల్కా, ఎండీ, మైక్రోస్టెప్‌-ఎంఐఎస్‌

·        మిస్టర్ రిచర్డ్ వర్గా, చైర్మన్-సీఈవో, వీఆర్‌ఎం

·        మిస్టర్ ఎడ్వర్డ్ క్రిస్టెయా, మార్కెటింగ్ మేనేజర్, వీఆర్‌ఎం

·        మిస్టర్ మిలోస్లావ్ కురిల్లా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు, ఈకో ఇన్వెస్ట్‌మెంట్స్‌

·        మిస్టర్ టిబోర్ గ్రెగర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, క్లబ్‌ 500

***


(रिलीज़ आईडी: 2273327) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam