పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆగ్రోబయోడైవర్సిటీ నిపుణుల కమిటీని పునర్వ్యవస్థీకరించిన జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ: ఛైర్మన్‌గా నియమితులైన పద్మశ్రీ డాక్టర్ పీఎల్ గౌతమ్

నాడు పోస్టు చేయడమైనది: 13 JUN 2026 10:03AM by PIB Hyderabad

జీవవైవిధ్య చట్టం-2002లోని సెక్షన్ 13(1) ప్రకారం ఆగ్రోబయోడైవర్సిటీ నిపుణుల కమిటీని జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బీఏఏడాది కాలానికి పునర్వ్యవస్థీకరించిందివ్యవసాయ జీవవైవిధ్య పరిరక్షణసుస్థిర వినియోగంసౌలభ్యం-ప్రయోజనాల పంపిణీ (ఏబీఎస్సంబంధిత అంశాలపై ఈ కమిటీ మార్గదర్శకత్వం అందిస్తుంది.

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తజాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థకూవృక్షజాతుల పరిరక్షణరైతు హక్కుల సంస్థ (పీపీవీఎఫ్ఆర్ఏ)కూ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన పద్మశ్రీ డాక్టర్ పీఎల్ గౌతమ్ పునర్వ్యవస్థీకరించిన కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారువ్యవసాయ శాస్త్రంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇటీవలే డాక్టర్ గౌతమ్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారుపీపీవీఎఫ్ఆర్ఏ ఛైర్‌పర్సన్ ఈ కమిటీకి సహ ఛైర్మన్‌గా ఉంటారు.

 

2005 నుంచి ఎన్‌బీఏకు వ్యవసాయ జీవవైవిధ్య నిపుణుల కమిటీ ముఖ్యమైన సలహా సంఘంగా ఉందివ్యవసాయ జన్యు వనరులకు సంబంధించి కొత్తగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీని కాలానుగుణంగా పునర్వ్యవస్థీకరిస్తున్నారుఅనేక ఏళ్లుగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలునిపుణులు ఈ సంఘానికి సారథ్యం వహిస్తున్నారుదేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యవసాయపరిశోధనవిద్యావిధాన సంస్థలకు చెందిన విశిష్ట ప్రతినిధులు దీనిలో భాగంగా ఉన్నారు.

 

వ్యవసాయ జీవవైవిధ్యానికి సంబంధించిన అనేక అంశాలపై నిపుణుల సిఫార్సులను అందించడం ద్వారా జీవవైవిధ్య చట్టం అమలులో ఈ కమిటీ కీలక పాత్ర పోషించిందిదీనిలో ఆహారంవ్యవసాయానికి సంబంధించి మొక్కల జన్యు వనరులపై అంతర్జాతీయ ఒప్పందం (ఐటీపీజీఆర్ఎఫ్ఏ)కు సంబంధించిన అంశాలువివిధ రకాల పంటల విత్తనాలుపాడి పశువుల పిండాల ఎగుమతులకు సంబంధించి ఎదురవుతున్న సౌలభ్యం-ప్రయోజనాల పంపిణీ సమస్యలుసంప్రదాయ మొక్కల ప్రజననానికి సంబంధించిన స్పష్టతలుజీవవైవిధ్య చట్టంలోని సెక్షన్ ప్రకారం జీవ వనరులకు సంబంధించిన భాగస్వామ్య పరిశోధన ప్రాజెక్టులకు సంబంధిత మంత్రిత్వ శాఖ జారీ చేసిన అనుమతుల నమూనా లాంటి అంశాలున్నాయి.

 

వ్యవసాయ పరిశోధనఆవిష్కరణజీవ వనరుల సుస్థిర వినియోగంతో జీవవైవిధ్య పరిరక్షణ లక్ష్యాలను సమతౌల్యం చేయడంలో కమిటీ సిఫార్సులు గణనీయమైన సహకారాన్ని అందించాయి.

 

వ్యవసాయంరైతు సంక్షేమ మంత్రిత్వ శాఖభారత వ్యవసాయ పరిశోధనా మండలిమొక్కలుపశువులుచేపల జన్యు వనరులకు సంబంధించిన జాతీయ బ్యూరోలుతమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంజాతీయ ఆవిష్కరణ ఫౌండేషన్నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంఇతర కీలక పరిశోధనవిద్యా సంస్థలకు చెందిన విశిష్ట నిపుణులుసీనియర్ ప్రతినిధులు ఈ పునర్వ్యవస్థీకరించిన కమిటీలో ఉన్నారు.

 

వ్యవసాయ రంగంలో జీవవైవిధ్య పరిశీలనలను ఏకీకృతం చేయడంలోనూసుస్థిర వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించడంలోనూ ఎన్‌బీఏకు ఈ కమిటీ సూచనలిస్తుందిజీవవైవిధ్య చట్టం ప్రకారం విత్తన రంగానికి సంబంధించిన సమస్యలను పరిశీలిస్తుందిజీవ వనరులకు సంబంధించిన అంతర్జాతీయ భాగస్వామ్య పరిశోధనల మార్గదర్శకాలను సమీక్షిస్తుందిఅంతరించిపోతున్న దేశీయ పంటల రకాలుజంతువుల పరిరక్షణసుస్థిర వినియోగానికి సంబంధించిన చర్యలను సిఫార్సు చేస్తుందిఐటీపీజీఆర్ఎఫ్‌ఏతో సహా వ్యవసాయ జీవవైవిధ్యానికి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాల్లో భారత్ పోషించే పాత్రకు మద్దతు ఇచ్చేలా సాంకేతికపరమైనవిధానపరమైన సలహాలను కూడా కమిటీ అందిస్తుంది.

 

వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలోనూజన్యు వనరులువాటికి సంబంధించిన సంప్రదాయ విజ్ఞానాన్ని సంరక్షించడంలోనూసుస్థిరమైనవాతావరణ మార్పులను తట్టుకోగలిగిన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంలోనూ భారత ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఆగ్రో బయోడైవర్సిటీ నిపుణుల కమిటీ పునర్వ్యవస్థీకరణ ప్రతిబింబిస్తుంది.

 

వ్యవసాయ జన్యు వనరులనుదేశీయ వంగడాలనుజంతు రకాలను పరిరక్షించడంసమర్థంగా వినియోగించుకోవడం ద్వారా నవీకరించిన ఎన్‌బీఎస్ఏపీలోని 4, 13 లక్ష్యాలను సాధించడంలోనూఎస్‌డీజీ 2( ఆకలి రహితం), ఎస్‌డీజీ 13 (వాతావరణ చర్య), ఎస్‌డీజీ 15 (భూమిపై జీవంసాకారం చేయడంలోనూ కమిటీ భారత్‌కు సహకరిస్తుంది.

 

 

***


(రిలీజ్ ఐడి: 2272778) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil , Kannada