ప్రధాన మంత్రి కార్యాలయం
వ్యవసాయం, పంటలు మనిషి జీవితానికి ఆధారమని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
11 JUN 2026 10:10AM by PIB Hyderabad
వ్యవసాయం ఒక్క జీవనోపాధి మార్గమే కాక, సమాజానికీ దేశానికీ పోషణకు మూలాధారం కూడా అని చెబుతున్న సంస్కృత భాషా సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘వ్యవసాయం ఒక్క బతుకుతెరువు సాధనం మాత్రమే కాదు.. అది సమాజంతో పాటు దేశ పోషణకు మూలాధారం. మన రైతు సోదరీ, సోదరులు ఓడ్చే చెమట మట్టిలో కలిసినప్పుడు అన్నంగా మారి, దేశ ప్రజల జీవనానికి ప్రధానాధారం గా నిలుస్తోంది.
తే కృషిం చ సస్యం చ మనుష్యా ఉప జీవన్తి
కృష్టరాధిరుపజీవనీయో భవతి య ఏవం వేద.
#12YearsOfKisanSamriddhi’’ అని పేర్కొన్నారు.
పైన ప్రస్తావించిన సంస్కృత సుభాషితానికి:
వ్యవసాయం, పంటలు మనిషి జీవితానికి మూలాధారం. ఈ సత్యాన్ని ఎవరు గ్రహించిన వారు వ్యవసాయ సంబంధ పనులను సరైన పద్ధతిలో పూర్తి చేస్తారు, దీని ద్వారానే సమాజానికి పాలనా, పోషణా అందుతాయి.. అని భావం.
(रिलीज़ आईडी: 2271545)
आगंतुक पटल : 7