ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై వరుసగా అత్యధిక కాలం సేవలందించిన
భారత ప్రధానిగా రికార్డు సృష్టించిన శ్రీ నరేంద్ర మోదీకి వివిధ దేశాధినేతల అభినందన సందేశాలు
प्रविष्टि तिथि:
10 JUN 2026 2:08PM by PIB Hyderabad
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై వరుసగా అత్యధిక కాలంపాటు దేశానికి సేవలందించిన భారత ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ నరేంద్ర మోదీ.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రభుత్వాధినేతల నుంచి అభినందన సందేశాలను అందుకుంటున్నారు.
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని తన స్నేహితుడు, సోదరుడు, మార్గదర్శిగా అభివర్ణిస్తూ.. గౌరవ భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే ఆయనకు ఇలా శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నా మిత్రుడు, సోదరుడు, మార్గదర్శి.”
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి గౌరవ శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు శ్రీలంక కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత్లోని శ్రీలంక హైకమిషన్ కూడా ఆ దేశ అధ్యక్షుడు దిసనాయకె సందేశాన్ని అందించింది. భారత్ – శ్రీలంక మధ్య ఉన్న సన్నిహిత, శాశ్వత భాగస్వామ్యాన్ని స్పష్టం చేసింది.
“భారత్ చరిత్రలో అత్యధిక కాలం పాటు సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన సన్నిహిత భాగస్వామ్యాన్ని అత్యంత విలువైనదిగా శ్రీలంక చూస్తోంది. రెండు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.’’
“భారత్ చరిత్రలో అత్యధిక కాలంపాటు సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన శ్రీ నరేంద్ర మోదీ గారికి శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర దిసనాయకే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మధ్య సన్నిహిత, చిరకాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో నిబద్ధతను ఈ సందేశం స్పష్టం చేస్తోంది.’’
చరిత్రాత్మక మైలురాయిని అధిగమించిన భారత ప్రధానమంత్రికి గౌరవ మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో ఏళ్ల అంకితభావంతో కూడిన ప్రజాసేవకూ, నాయకత్వానికీ నిదర్శనంగా దీనిని అభివర్ణించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు ఇరుదేశాల ప్రజలకూ అవకాశాలను విస్తరించుకునేందుకు మలేషియా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
“భారత్‌లో అత్యంత సుదీర్ఘ కాలం సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా చరిత్రాత్మక మైలురాయిని అధిగమించిన మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో కూడిన ఆయన ప్రజాసేవకూ, దేశ అభివృద్ధి- సమృద్ధిని ముందుకు తీసుకెళ్లిన ఆయన నాయకత్వానికీ ఈ విజయం నిదర్శనం. భారత్తో సన్నిహిత, దీర్ఘకాలిక మైత్రిని అత్యంత విలువైనదిగా మలేషియా భావిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంలోనూ, మన ప్రజలకు అవకాశాలను విస్తరించడంలోనూ ఇరుదేశాల మధ్య సహకారాన్ని కొనసాగించే దిశగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి నిరంతర విజయమూ, అలాగే భారత ప్రజలకు శాంతి, పురోగతి, సమృద్ధులూ చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.’’
***
(रिलीज़ आईडी: 2271345)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada