బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై హైదరాబాద్‌లో రేపు రోడ్ షో నిర్వహించనున్న బొగ్గు మంత్రిత్వ శాఖ

प्रविष्टि तिथि: 10 JUN 2026 10:37AM by PIB Hyderabad

న్యూఢిల్లీలో నిర్వహించిన బొగ్గులిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల రోడ్ షో విజయవంతం కావటం వల్ల అందిన ప్రోత్సాహంతో జూన్ 11, 2026న హైదరాబాద్‌లో మరో రోడ్ షోను నిర్వహించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ సిద్ధమైందిగత కార్యక్రమానికి వచ్చిన అద్బుతమైన స్పందనక్రీయాశీల భాగస్వామ్యం... భారతదేశ బొగ్గు గ్యాసిఫికేషన్ వ్యవస్థపై పరిశ్రమల భాగస్వాముల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని స్పష్టం చేయటమే కాకవ్యూహాత్మక రంగంలో పుట్టుకొస్తున్న గణనీయమైన అవకాశాలను తెలియజేశాయి.

హైదరాబాద్ రోడ్ షోకు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగాకేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే గౌరవ అతిథిగా హాజరుకానున్నారుఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝామంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పాటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులుబొగ్గులిగ్నైట్ కంపెనీల ప్రతినిధులుసాంకేతిక నిపుణులుపారిశ్రామిక సంఘాలుపెట్టుబడిదారులుఇతర కీలక భాగస్వాములు పాల్గొననున్నారు.

బొగ్గు గ్యాసిఫికేషన్ విప్లవాత్మక సాంకేతికతఇది బొగ్గుని సింథసిస్ గ్యాస్ (సిన్ గ్యాస్)గా మారుస్తుందిదీన్ని మిథనాల్అమ్మోనియం నైట్రేట్సింథటిక్ సహజ వాయువుపలు రకాల పారిశ్రామిక రసాయనాల వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారుదీని వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించిన భారత ప్రభుత్వం.. ఇంధన భద్రతను పెంపొందించేందుకుదిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకుదేశీయ బొగ్గు వనరుల వినియోగాన్ని వైవిధ్యభరితంగా మార్చేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించటానికి పలు విధానపరమైన చర్యలనుప్రోత్సాహకాలని చేపట్టింది.

విధానపరమైన మద్దతు, సాంకేతిక ఆవిష్కరణలుపెట్టుబడి అవకాశాలుప్రాజెక్టు అమలు వ్యూహాలపై చర్చలకు ఈ రోడ్ షో కీలక వేదిక అవుతుందిదేశవ్యాప్తంగా బొగ్గులిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఉమ్మడి భాగస్వామ్య మార్గాలను అన్వేషించటానికి విధాన రూపకర్తలుప్రముఖ పారిశ్రామికవేత్తలుసాంకేతిక నిపుణులుపెట్టుబడిదారులను ఈ కార్యక్రమం ఒకచోట చేరుస్తుంది.

వాటాదారుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను సులభతరం చేసేందుకుభారతదేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్‌కు పటిష్ఠమైన వ్యవస్థను సృష్టించేందుకు ఈ కార్యక్రమం సహకరిస్తుందిఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకుపరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకుమెరుగైన ఇంధన భద్రతస్థిరమైన వనరుల వినియోగంపారిశ్రామిక వృద్ధి ద్వారా ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.

 

****

 

(रिलीज़ आईडी: 2271021) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil