ఉక్కు మంత్రిత్వ శాఖ
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) లో అగ్నిప్రమాదం
प्रविष्टि तिथि:
08 JUN 2026 9:32PM by PIB Hyderabad
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్-1 (ఎస్ఎంఎస్-1) వద్ద ఈరోజు (జూన్ 8, 2026) సాయంత్రం సుమారు 4:15 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది.
లాడిల్ నుంచి ద్రవరూప ముడి ఉక్కును టుండిష్ లోనికి పోసి క్యాస్టర్‌కు పంపడానికి వీలుగా స్లైడ్ గేట్ తెరిచే లోపే ఒక్కసారిగా అత్యంత తీవ్రమైన పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భారీ అగ్నిగోళం క్షణాల్లో పైకప్పు ఎత్తు వరకు ఎగసిపడింది. దీని తీవ్రతకు అక్కడ పైభాగంలో ఉన్న ఓవర్‌హెడ్ క్రేన్-2 కు కూడా మంటలు అంటుకున్నాయి.
ఈ ప్రమాదంలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద కారణాలపై రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ దర్యాప్తు ప్రారంభించింది.
ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సెయిల్ కు చెందిన బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఇన్‌చార్జ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన మరో విచారణ కమిటీని కూడా నియమించారు.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ప్రమాద స్థలానికి బయలుదేరారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నారు.
***
(रिलीज़ आईडी: 2270606)
आगंतुक पटल : 33