ప్రధాన మంత్రి కార్యాలయం
తల్లి పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ చారిత్రాత్మక రికార్డు... ప్రజలను అభినందించిన ప్రధాని
प्रविष्टि तिथि:
05 JUN 2026 11:40PM by PIB Hyderabad
దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే అద్భుతమైన ఘనతను సాధించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంతో ముడిపడి ఉన్న ఈ అద్భుత విజయం పర్యావరణ పరిరక్షణకు ప్రజలు ఎంతగా కట్టుబడి ఉన్నారో స్పష్టంగా తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్‌కే కాకుండా యావత్ దేశానికి హరిత భవిష్యత్తును అందించడంలో ఎంతగానో దోహదపడతాయని, ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని ప్రధాని దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
"దేశప్రజలందరికీ స్ఫూర్తినిచ్చే ఈ అద్భుతమైన ఘనతను సాధించినందుకు ఉత్తరప్రదేశ్‌లోని నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు! 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంతో ముడిపడి ఉన్న ఈ అద్భుత విజయం పర్యావరణ పరిరక్షణ కోసం నేడు ప్రజలు ఎంతగా కట్టుబడి ఉన్నారో స్పష్టంగా తెలియజేస్తోంది. ఇలాంటి ఉదాత్తమైన కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్‌తో పాటు యావత్ దేశ హరిత భవిష్యత్తును సాకారం చేయడంలో ఎంతగానో దోహదపడతాయని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను."
(रिलीज़ आईडी: 2269925)
आगंतुक पटल : 2