ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీ), పారిశ్రామిక - అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మధ్య అవగాహన ఒప్పందం


భారత పెట్టుబడి రంగంలో సమాచారాన్ని వివిధ భాషల్లో అందుబాటులోకి తేవడం లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 01 JUN 2026 6:50PM by PIB Hyderabad

భాషిణి సేవ/సంచలన్ భాషిణి సహయోగి కార్యక్రమం’ కింద.. ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ కింది డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీపరిధిలోని డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీ), వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పారిశ్రామిక అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయిభాషిణి వేదిక ద్వారా భారత పారిశ్రామికఅంతర్గత వాణిజ్య వ్యవస్థలో బహుభాషా డిజిటల్ సామర్థ్యాలనుజాతీయ భాషాపరమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం లక్ష్యం.

 

 

వివిధ భాషల్లో సమాచారాన్ని అందుబాటులోకి తేవడం, వివిధ భాషల్లో నిర్వహణరాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలు కింద గుర్తించిన 22 భాషల్లోనూ డీసీఐఐటీ డిజిటల్ వేదికల్లో సేవలను అందించడం ఈ భాగస్వామ్య ముఖ్య లక్ష్యందీనివల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుఅంకుర సంస్థలుపెట్టుబడిదారులువ్యాపార సంస్థలుప్రజలు తమ భాషల్లోనే సమాచారాన్నిప్రభుత్వ సేవలను సులభంగా పొందే అవకాశం లభిస్తుంది.

ఈ భాగస్వామ్యంలో భాగంగా.. డీపీఐఐటీ వేదికల్లో వివిధ భాషా సేవలను అందించడం కోసం డీపీఐఐటీభాషిణి బృందం కలిసి పనిచేస్తాయిఅనువాద ఏపీఐలురంగాల వారీగా భాషా నమూనాల అభివృద్ధిబహుభాషా పదకోశాలను సృష్టించడంశబ్దపరమైన సాంకేతికతలుభాషాపరమైన డేటాతోపాటు.. భాషిణి ఉద్యత్మిత్రయాప్‌మిత్రప్రవక్త వంటి ప్రత్యేక సాంకేతికతలుకార్యక్రమాల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేస్తారు.

ప్రభుత్వ సమాచార లభ్యతఅంకుర సంస్థలు పారిశ్రామిక సేవలువిధానపరమైన సమాచారంప్రజా భాగస్వామ్యాల్లో భాషాపరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా.. మరింత సమ్మిళితమైన పెట్టుబడి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది.

దేశంలోని వైవిధ్య భరితమైన భాషా వాతావరణానికి అనుగుణంగా శబ్దపరమైన బహుభాషా సేవలను అందించే చేసే దిశగా.. పెట్టుబడులకు ప్రోత్సాహంపారిశ్రామిక అభివృద్ధిఆవిష్కరణలువ్యవస్థాపక సంబంధ రంగాలకు సరిపోయే బహుభాషా ఏఐ నమూనాలనుభాషా సాంకేతికతలను బలోపేతం చేయడంపై కూడా ఈ భాగస్వామ్యం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.

భారతీయ అంకుర సంస్థలుతయారీ రంగంఆవిష్కరణ వ్యవస్థల్లో అవకాశాల లభ్యతను విస్తరించడంలో బహుభాషా సాంకేతికతల ప్రాధాన్యం పెరుగుతోందని ఈ చర్చలు స్పష్టం చేశాయిఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యానికి భాష అవరోధం కాకూడదన్న భరోసానిచ్చే దిశగా చర్చలు సాగాయి.

డీపీఐఐటీ అనుబంధ సంస్థలు, భాగస్వామ్య పక్షాల పరిధిలో భాషాపరమైన సమాచార సేకరణఅవగాహన కార్యక్రమాలుసామర్థ్యాభివృద్ధి చర్యలతోపాటు.. బహుభాషా ఏఐ సాధనాల విస్తృత వినియోగాన్ని ఈ అవగాహన ఒప్పందం ప్రోత్సహిస్తుంది.

ఈ సహకారంలో భాగంగా.. బహుభాషా డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతంఆవిష్కరణలకు ప్రోత్సాహంపెట్టుబడి వ్యవస్థలో సేవల లభ్యతను విస్తరించడం వంటి లక్ష్యాలతో కూడిన నిర్దిష్ట కార్యక్రమాలను డీపీఐఐటీడీఐబీడీ సంయుక్తంగా చేపట్టిసహకారాన్ని అందించవచ్చు.

సమ్మిళిత, అందుబాటులో ఉన్నఏఐ ఆధారిత డిజిటల్ పాలన దిశగా.. దేశ జనాభా విస్తృతికి తగిన భాషా మౌలిక సదుపాయంగా భాషిణి పాత్రను ఈ భాగస్వామ్యం స్పష్టం చేస్తోందిఅదే సమయంలో ఆర్థిక వికాసంలో విస్తృత భాగస్వామ్యంవ్యవస్థాపకతపెట్టుబడులకు ప్రోత్సాహంలో దేశ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీగురించి:

డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీ).. ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ కింది డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీపరిధిలోకి వస్తుందిఏఐ ఆధారిత బహుభాషా డిజిటల్ సమ్మిళితత్వంభాషా సాంకేతికతల్లో భారత్ చేపట్టిన జాతీయ స్థాయి కార్యక్రమమిదిజాతీయ భాషా సాంకేతికతా కేంద్రం (ఎన్‌హెచ్ఎల్‌టీద్వారా.. పాలనప్రభుత్వ వేదికలుసంస్థల కోసం అన్ని భారతీయ భాషల్లో విస్తృతమైన వాచకసందేశ ఆధారిత ఏఐ సేవలకు భాషిణి అవకాశం కల్పిస్తుందిఈ వేదిక ప్రస్తుతం 800కు పైగా ప్రభుత్వ వెబ్‌సైట్లకు సేవలందిస్తూరోజూ 15 మిలియన్లకు పైగా సందేహాలను పరిష్కరిస్తోందిఅలాగే 36 భారతీయ లిఖిత భాషలు, 23 భారతీయ మౌఖిక భాషలు, 35 అంతర్జాతీయ భాషల్లో సహకారాన్ని అందిస్తుందిఓపెన్ సోర్స్ ఆవిష్కరణలుబహుభాషా ఏఐ పరిశోధనలుసమాచార కోశాల అభివృద్ధిఅంకుర సంస్థలకు ప్రోత్సాహంవిద్యాసంస్థలతో భాగస్వామ్యాలను కూడా డీఐబీడీ ముందుకు తీసుకెళ్తోందితద్వారా దేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2268061) సందర్శకుల సూచీ సంఖ్య : : 27
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी