యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఏషియన్ గేమ్స్ 2026 కన్నా ముందు టీఓపీఎస్ డెవలప్‌మెంట్ గ్రూపులో 22 మంది రోయర్లకు స్థానం
సీడబ్ల్యూజీ 2030 లక్ష్యంగా రోయింగ్ క్రీడలో ఆసక్తిదారులను పెంచుకొనే ప్రయత్నాల్లో భారత్
నాడు పోస్టు చేయడమైనది:
01 JUN 2026 5:06PM by PIB Hyderabad
ఐచీ-నాగోయాలో నిర్వహించనున్న ఏషియన్ గేమ్స్-2026 తో పాటు త్వరలో మరిన్ని ఇతర ఈవెంట్లు చోటుచేసుకోనున్నాయి. అంతకన్నా ముందు జరిగిన మిషన్ ఒలింపిక్ సెల్ (ఎమ్ఓసీ) 174వ సమావేశంలో, అనేక మంది రోయర్ల (తెడ్లతో పడవ నడిపే వారిని) టార్గెట్ ఒలింపిక్ పోడియమ్ స్కీమ్ (టీఓపీఎస్) డెవలప్‌మెంట్ గ్రూపులో చేర్చారు. భారత రోయింగ్ సమాఖ్య (ఆర్ఎఫ్ఐ) వార్షిక జాతీయ ఎంపిక పరిశీలనలు ముగించి, ‘క్రూ’ కు తుది రూపునిచ్చిన మీదట ఈ జాబితాను రూపొందించారు.
ప్రస్తుతం ఆరు పడవలకు సంబంధించి మొత్తం 22 మంది రోయర్లను టాప్స్ డెవలప్‌మెంట్ గ్రూపునకు ఎంపిక చేశారు. వీరు రోయింగ్ ఒక క్రీడాంశంగా ఉండే ఏషియన్ గేమ్స్, వరల్డ్ కప్ సర్క్యూట్ సహ ప్రధాన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమవుతారు. తాజాగా చేర్చుకున్న ప్రముఖ క్రీడాకారుల్లో 2024లో ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన శ్రీ బల్‌రాజ్ పన్‌వర్, ఏషియన్ గేమ్స్-2022లో రజత పతక విజేత శ్రీ అరవింద్ సింగ్, ఏషియన్ గేమ్స్-2022లో డబల్ పతక విజేత శ్రీ జస్‌వీందర్ సింగ్ సహా మరికొందరు ఉన్నారు.
ఈ 22 రోయర్లను వివిధ పడవల విభాగాల్లో సర్దుబాటు చేశారు. ఈ విభాగాల్లో పురుషుల సింగిల్ స్కల్స్ (ఎమ్1ఎక్స్), పురుషుల డబల్ స్కల్స్ (ఎమ్2ఎక్స్), పురుషుల క్రాడ్రుపల్ స్కల్స్ (ఎమ్4ఎక్స్), లైట్‌వెయిట్ మెన్స్ డబల్ స్కల్స్ (ఎల్ఎమ్2ఎక్స్), పురుషుల కాక్స్‌డ్ ఎయిట్ (ఎమ్4-)తో పాటు మహిళల కాక్స్‌లెస్ ఫోర్స్ (డబ్ల్యూ4-) భాగంగా ఉన్నాయి. క్రీడాకారుల్లో చాలా మందిని ఏషియన్ గేమ్స్-2026ను దృష్టిలో పెట్టుకొని సన్నద్ధం చేస్తున్నారు. కామన్‌వెల్త్ గేమ్స్-2030 వంటి భావి పోటీలు లక్ష్యంగా పెట్టుకొని కొంత మంది క్రీడాకారుల బృందాలకు తగిన శిక్షణను అందిస్తున్నారు.
భారతీయ రోయర్లుగా ఇంత మందిని టీఓపీఎస్ డెవలప్‌మెంట్ గ్రూపులోకి చేర్చుకోవడం.. వ్యక్తిగత పతకం విభాగంలో గల అవకాశాలపైన దృష్టి పెట్టడం కన్నా అనేక బోట్ కేటగిరీల్లో పోటీ పడగలిగే క్రీడాకారులుగా చాలినంత మందిని తీర్చిదిద్దే దిశగా చేసిన మరో ప్రయత్నమని చెప్పాలి. భారత్ 2030వ సంవత్సరంలో కామన్‌వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ) వందో సంచికను నిర్వహించడానికి సన్నద్ధమవుతున్న క్రమంలో, రోయింగ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సంబంధిత క్రీడాకారులను చెప్పుకోదగిన సంఖ్యలో తయారు చేసుకోవడం చాలా కీలకం. కామన్‌వెల్త్ గేమ్స్1986 సంచికను ఎడిన్‌బర్గ్‌లో నిర్వహించారు. అప్పటి నుంచి రోయింగ్ క్రీడ కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా లేదు. అయితే ఈ ఆటల వందో సంచికలో దీనిని తిరిగి తీసుకు వచ్చే సూచనలు ఉన్నాయి.
టీఓపీఎస్ డెవలప్‌మెంట్ రోవర్లలో చేర్చుకున్న వారి పూర్తి జాబితా :
పురుషుల సింగిల్ స్కల్స్ - శ్రీ అరవింద్ సింగ్
పురుషుల డబల్ స్కల్స్ - శ్రీ నవ్‌దీప్ సింగ్, శ్రీ కుల్వీందర్ సింగ్
పురుషులు క్వాడ్రుపల్ స్కల్స్ - శ్రీ బల్‌రాజ్ పన్వర్, శ్రీ సత్‌నామ్ సింగ్, శ్రీ జాకర్ ఖాన్, శ్రీ సల్మాన్ ఖాన్
లైట్‌వెయిట్ పురుషుల డబల్ స్కల్స్ - శ్రీ లక్షయ్, శ్రీ ఉజ్జ్వల్ కుమార్ సింగ్
పురుషుల కాక్స్‌డ్ యైట్ - శ్రీ జస్‌వీందర్ సింగ్, శ్రీ నితిన్ కుమార్, శ్రీ బాబులాల్ యాదవ్, శ్రీ యోగేశ్ కుమార్, శ్రీ ఘుర్దే విపుల్ సతీశ్, శ్రీ సౌరవ్ కుమార్, శ్రీ ఇక్బాల్ సింగ్, శ్రీ సన్నీ కుమార్, శ్రీ ధనంజయ్ ఉత్తమ్ పాండే
మహిళల కాక్స్‌లెస్ ఫోర్స్ - గుర్‌బాణి కౌర్, పూనమ్, తెందెన్‌థోయీ, అలీనా అంటో
***
(రిలీజ్ ఐడి: 2267895)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13