కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆసుపత్రులు, డిస్పెన్సరీలన్నింటా కేంద్రీకృత ఆన్‌లైన్ పేషెంట్ సమాచార వ్యవస్థను ప్రారంభించిన ఈఎస్ఐసీ

రోగి ప్రయోజనాలకు పెద్ద పీట

డిజిటల్ మార్గాల ద్వారా లబ్ధిదారులు స్వచ్ఛత, సిబ్బంది ప్రవర్తన, మందుల లభ్యతపై అభిప్రాయాల సేకరణ

సేవల రేటింగ్ 3 కన్నా తక్కువ ఉంటే దిద్దుబాటు చర్య కోరుతూ అభ్యంతరాలను తెలిపే వ్యవస్థ.. దీనికి ఓటీపీ ప్రామాణికత, అనేక భాషల తోడ్పాటుతో సహా వాస్తవ కాల ప్రాతిపదికన పర్యవేక్షణకు డ్యాష్‌ బోర్డుల హంగు

నాడు పోస్టు చేయడమైనది: 01 JUN 2026 3:11PM by PIB Hyderabad

సేవల్లో నాణ్యతను పెంచడానికీరోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ వారికి ఆరోగ్య సేవల అందజేతను నిర్ధారించే దిశగా ఒక ముఖ్య నిర్ణయాన్ని కార్మికఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ అధీనంలోని కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీతీసుకుంది.. దేశమంతటా ఉన్న ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లోనూడిస్పెన్సరీల్లోనూ కేంద్రీకృత ఆన్‌లైన్ పేషెంట్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ (రోగుల ప్రతిస్పందన వ్యవస్థ)ను విజయవంతంగా ప్రారంభించింది.
బీమా సదుపాయాన్ని కలిగివున్న వ్యక్తుల (ఐపీస్)తో పాటు లబ్ధిదారులు ఆరోగ్య సేవలకు సంబంధించిన తమ అనుభవాలను స్వయంగా పంచుకోవడంనిర్దిష్ట ఆందోళనలేవైనా ఉంటే వాటిని వ్యక్తం చేయడంసంస్థాగత మెరుగుదలను కోరుకుంటూ ఆచరణ రూపాన్ని ఇవ్వడానికి వీలున్న సూచనలనూసలహాలనూ తెలిపేటట్లు ఈ డిజిటల్ కార్యక్రమం చూస్తుందికీలక సేవలకు కొలమానాలనుప్రత్యేకించి ఆసుపత్రి లేదా డిస్పెన్సరీలో స్వచ్ఛతవైద్య సిబ్బంది నడవడిక తీరుతెన్నులుఅవసరమైన మందుల అందుబాటు అంశాలలో పౌరుల స్పందనను నేరుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్‌ఫారాన్ని (వేదికనురూపొందించారు.  
నిరంతరాయ లభ్యతతో పాటు బహుభాషల తోడ్పాటు
ఎక్కువ మంది పాలుపంచుకొనేటట్లు చూడడానికీపూర్తి సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికీ ఈ సిస్టమ్  లబ్ధిదారులకు ప్రతిస్పందన తెలియజేయడానికి అనేక మార్గాల్ని అందిస్తోంది:
      • 
ఆటోమేటెడ్ ఎస్ఎమ్ఎస్ లింకులుఈఎస్ఐసీ హెచ్ఐఎస్ (ధన్వంతరిమాడ్యూలును ఉపయోగించి సేవల ప్రయోజనాలను పొందిన తరువాత బీమా సదుపాయం కలిగిన వ్యక్తికి ఎస్ఎమ్ఎస్ ద్వారా ఒక ప్రతిస్పందన లింకును వెంటనే పంపిస్తారు.
      • 
ఆన్-సైట్ క్యూఆర్ కోడ్‌లులబ్ధిదారులు అందరూ ఓపీడీలూఆసుపత్రుల్లో వేరువేరు ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన బహుభాషా పోస్టర్లపై ప్రదర్శించిన క్యూఆర్ కోడ్‌‌లను స్కాన్ చేసి తమ స్పందనను వెంటనే తెలియజేయవచ్చు.
      • 
వెబ్ పోర్టల్అధికారిక ఈఎస్ఐసీ వెబ్‌సైట్ నుంచి నేరుగా ప్రతిస్పందనను తెలియజేయవచ్చు.
ఉపయోగించుకొనే వారికి అనుకూలమైందిగా ఉండగల ఇంటర్‌ఫేస్‌లో భాగంగా రోగులు తమ మొబైల్ పరికరాలను వాడుతూక్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుందితమ ఐపీ నంబరును నమోదు చేసితమకు కలిగిన అనుభవానికి రేటింగును ఇవ్వాలికొద్ది సెకన్ల లోపల తమ అభిప్రాయాన్ని తెలియజేయాల్సివుంటుంది.

 

పారదర్శకత్వంతో పాటు జవాబుదారుతనానికి ఉద్దేశించిన పటిష్ట సాంకేతికత
స్పందన యంత్రాంగ ప్రామాణికతను నిర్ధారించడం కోసంసిస్టమ్‌లో ఓటీపీ చెల్లుబాటు ప్రక్రియను అనుసరించి ఐపీ వివరాలను వాస్తవ కాల ప్రాతిపదికన సరిచూడడానికీనకిలీ ప్రతిస్పందనలను అడ్డుకోవడానికీ ఖచ్చిత యంత్రాంగాలను జతపరిచారుదీనికి అదనంగాప్రతిస్పందన ప్లాట్‌ఫారమ్.. భారత్‌లోని వివిధ కార్మికుల అవసరాలను ప్రభావవంతంగా నెరవేర్చడానికి విస్తృత స్థాయి సహాయాన్ని బహుళ భాషలలో అందజేస్తుంది.


అంచెల వారీ పర్యవేక్షణతో పాటు ఫిర్యాదుల సత్వర పరిష్కారం
రోగుల స్పందనను బట్టి తక్షణం పరిపాలన పరమైన చర్యలను చేపట్టడానికి సిస్టమ్‌లో బలమైనపాత్ర-ఆధారిత డిజిటల్ డ్యాష్‌బోర్డుల ఏకీకరణకు చోటు కల్పించారుదీనితో మూడు వేర్వేరు పరిపాలక అంచెలలో నిరంతరంగావాస్తవ కాల ప్రాతిపదికన పనితీరును పర్యవేక్షించేందుకు మార్గం సుగమం అవుతోందిఆ అంచెలు ఇలా ఉన్నాయి..:

     • ప్రధాన కేంద్రం స్థాయి
     • ప్రాంతీయ కార్యాలయాల స్థాయి
     • స్థానిక ఇఎస్ఐ ఆరోగ్య సదుపాయాల స్థాయి
ఈ సిస్టమ్‌ను ప్రత్యేకంగా రూపొందించడం అన్నింటి కన్నా ముఖ్యమైన అంశంఇది సేవల రేటింగు కన్నా తక్కువకు పడిపోతేఆ విషయాన్ని తనంతట తాను పసిగట్టిగంభీర సమస్యల్ని గుర్తిస్తుందిఈ ఆటోమేటిక్ అలర్ట్ యంత్రాంగం సంబంధిత అధికారులు సకాలంలోలక్షించిన దిద్దుబాటు చర్యలను చేపట్టడానికి మార్గాన్ని సుగమం చేస్తుందిదీనికి తోడుఈ ప్లాట్‌ఫారమ్ అన్ని ఆరోగ్యసంరక్షణ సదుపాయాల పనితీరు ర్యాంకింగునూ బలోపేతం చేస్తుందినిరంతర ప్రాతిపదికన మెరుగుదలఆరోగ్యవంతమైన పోటీతత్వంఖచ్చితమైన సంస్థాగత జవాబుదారీతనంతో కూడిన సంస్కృతిని ఇది ప్రోత్సహిస్తుంది.
దేశంలో కార్మికుల పట్ల ఈఎస్ఐసీ అంకిత భావానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనంగా నిలుస్తోందిఇది ‘‘మెరుగైన ఆరోగ్య సేవల్ని అందించడానికి ఈఎస్ఐసీ కట్టుబడి ఉంది’’ అనే మూల మంత్రాన్ని చాటిచెబుతోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2267601) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Odia , Tamil , Kannada