ప్రధాన మంత్రి కార్యాలయం
‘వినమ్రత.. క్షమాగుణం.. సదాచరణ’ల వైశిష్ట్యాన్ని చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
29 MAY 2026 8:45AM by PIB Hyderabad
ఉత్తమ మానవుడి వ్యక్తిత్వానికి ‘వినమ్రత, క్షమాగుణం, సత్ప్రవర్తన’లే నిజమైన ఆభరణాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సద్గుణాలు ప్రాతిపదికగా ‘వికసిత్ భారత్’ సంకల్ప సాకారానికి దేశ ప్రజలు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా కింది సంస్కృత సుభాషితాన్ని ఆయన ప్రజలతో పంచుకున్నారు.
“తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా
భవంతి సంపద దైవీమభిజాతస్య భారత” అంటే-
“తేజస్సు, క్షమాగుణం, అసమాన ధైర్యం, నిష్కపట ప్రవర్తన దేశంపై అంకితభావం, అహంకార రహిత వినయశీల వ్యక్తిత్వం- వంటి దైవిక సద్గుణాలు ఉత్తమ మానవుడి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే లక్షణాల”ని ఈ సుభాషితం వివరిస్తుంది.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“వినమ్రత, క్షమాగుణం, సత్ప్రవర్తన’ మానవుడి వ్యక్తిత్వానికి నిజమైన ఆభరణాలు. ఈ సద్గుణాలు ప్రాతిపదికగా నేటి పౌరులు ‘వికసిత భారత్’ సంకల్ప సాకారం కోసం అవిరళ కృషిని కొనసాగిస్తున్నారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2266502)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam