ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆయుష్ మంత్రిత్వ శాఖ నియంత్రణలోని ‘ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్’లో పెట్టుబడుల ఉపసంహరణ దిశగా మెస్సర్స్ ‘స్కైమ్యాప్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు వ్యూహాత్మక కొనుగోలుదారుగా ఆమోదం
బహుళ స్థాయి సంప్రదింపుల నిర్ణయాధికార యంత్రాంగం తోడ్పాటుతో రెండు దశల పోటీ బిడ్డింగ్ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీ అమలు
నాడు పోస్టు చేయడమైనది:
26 MAY 2026 7:01PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌ఈ) ‘ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్’ (ఐఎంపీసీఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణ దిశగా ‘స్కైమ్యాప్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యూహాత్మక కొనుగోలుదారు సంస్థగా ఆమోదం పొందింది.
కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) నియంత్రణలోని సాధికార మంత్రుల బృందంతో కూడిన ప్రత్యామ్నాయ యంత్రాంగం స్కైమాప్ సంస్థ అత్యధికంగా రూ.121,00,94,400తో ప్రతిపాదించిన బిడ్‌ను ఆమోదించింది. ఈ మేరకు ‘ఐఎంపీసీఎల్’ లోని 100 శాతం ఈక్విటీ వాటాలను స్కైమ్యాప్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేయడంతోపాటు యాజమాన్యం కూడా ఆ సంస్థకు బదిలీ అవుతుంది.
ప్రామాణిక ఆయుర్వేద-యునాని ఔషధాల తయారీ-సరఫరా ప్రధాన లక్ష్యంగా ‘ఐఎంపీసీఎల్’ను1978 జూలై 12న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రెండు దశల బిడ్డింగ్ ద్వారా వ్యూహాత్మక కొనుగోలుదారును గుర్తించే ప్రక్రియలో భాగంగా ‘ఐఎంపీసీఎల్’ ఈక్విటీ వాటాల వ్యూహాత్మక ఉపసంహరణ కోసం 2017 నవంబరులో ‘సీసీఈఏ’ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
ఆ ప్రక్రియను పూర్తిచేశాక లావాదేవీ నిర్వహణ దిశగా వృత్తిపరమైన సలహాదారులు (లావాదేవీ-న్యాయ-ఆస్తి విలువ నిర్ధారక సంప్రదింపు సంస్థలను) నియమించారు. పోటీదారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానిస్తూ 01.09.2023న ప్రాథమిక సమాచార ప్రకటన జారీచేశారు. దీనిపై 7 సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు దాఖలు చేశాయి. అనంతరం ఈ సంస్థలన్నిటితో జాబితా రూపొందించి అర్హతగల బిడ్డర్లతో ప్రతిపాదనల స్వీకరణ ప్రక్రియ నిర్వహించారు. ఇందుకోసం ‘ఎంహెచ్‌ఏ’ నుంచి సెక్యూరిటీ అనుమతి కూడా పొందారు.
నిబంధనలు-షరతుల సహిత వాటాల కొనుగోలు ఒప్పందం సహా ప్రతిపాదనల కోసం అభ్యర్థనను, సాంకేతిక-ఆర్థిక బిడ్లను ఆహ్వానిస్తూ 01.12.2025న ప్రకటన జారీ అయింది. దీనికి నిర్దేశించిన గడువు తేదీ 20.01.2026 నాటికి పోటీదారులలోని రెండు సంస్థల నుంచి సీల్డ్ ఫైనాన్షియల్ బిడ్‌లు అందాయి. వీటిని నిర్దేశిత విధానం కింద మూల్యాంకనం చేసి, రెండింటికీ సాంకేతికంగా అర్హత ఉన్నట్లు తేల్చారు. అటుపైన పోటీదారుల ప్రతినిధుల సమక్షంలో సాంకేతిక అర్హత సాధించిన బిడ్లను తెరిచారు. వీటిలో మెస్సర్స్ స్కైమ్యాప్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభ ధరను మించి రూ.121,00,94,400 మేర అత్యధికంగా ప్రతిపాదించింది.
ఈ విధంగా అంతర మంత్రిత్వ బృందం, పెట్టుబడుల ఉపసంహరణపై కార్యదర్శుల కీలక సంఘం, సాధికార ప్రత్యామ్నాయ యంత్రాంగంతో కూడిన బహుళ స్థాయి సంప్రదింపుల నిర్ణయాధికార యంత్రాంగం తోడ్పాటుతో రెండు దశల బహిరంగ, పోటీ బిడ్డింగ్ ప్రక్రియ రూపంలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీని అమలు చేశారు. తదనుగుణంగా అందరికన్నా అధిక ధర ప్రతిపాదించిన పోటీదారుకు అవార్డు పత్రం (లెటర్ ఆఫ్ అవార్డ్) జారీచేశారు. ఈ లావాదేవీని వీలైనంత త్వరగా ముగింపు దశకు తేవడంలో ‘డిపామ్’ (డిఐపీఏఎం) కార్యదర్శి, ఆయుష్ శాఖ కార్యదర్శులకు ప్రభుత్వం అధికారమిచ్చింది.
***
(రిలీజ్ ఐడి: 2265793)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9