కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌-జపాన్‌ సెమినార్‌తో శ్రామిక శక్తి సహకారంలో నూతనోత్తేజం

నాడు పోస్టు చేయడమైనది: 26 MAY 2026 12:28PM by PIB Hyderabad

భారత్‌-జపాన్‌ దేశాల మధ్య శ్రామిక శక్తి సహకారంపై మే 25న టోక్యోలో సంయుక్త సెమినార్‌ జరిగిందిజపాన్‌లోని భారత రాయబార కార్యాలయంఆసియాన్‌ వన్‌ కో లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ సెమినార్‌ను నిర్వహించాయిఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ కార్మికఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి వందన గుర్నాని ముఖ్య అతిథిగా హాజరైకీలక ప్రసంగం ఇచ్చారు.

భారత్‌, జపాన్‌ దేశాల మధ్య నైపుణ్యం గల కార్మిక శక్తి మార్పిడిమానవ వనరుల అభివృద్ధిలో దీర్ఘకాలిక సహకారంపై చర్చించేందుకు జపాన్ విధాన రూపకర్తలుపరిశ్రమల ప్రముఖులువిద్యా సంస్థలుశ్రామిక శక్తి రవాణా భాగస్వాములు ఈ సెమినార్‌లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి భారత్‌, జపాన్‌ దేశాల ప్రముఖ ప్రతినిధులు హాజరయ్యారుజపాన్ ప్రతినిధుల సభ సభ్యులైన న్యాయశాఖ మాజీమంత్రి మిస్టర్ యమషితఆర్థికవాణిజ్యపరిశ్రమల శాఖల మంత్రి మిస్టర్ ఇనోవిద్యసంస్కృతిక్రీడలుసైన్స్టెక్నాలజీ శాఖల మంత్రి మిస్టర్ నకమురాజపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ చైర్మన్ మిస్టర్ తదాషి మేదాజపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మిస్టర్ కెంగో ఒట్సుకాజపాన్‌లోని భారత రాయబారి శ్రీమతి నగ్మా మహ్మద్ మల్లిక్ ఈ సెమినార్‌లో పాల్గొన్నారు.

భారత కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రసంగిస్తూ.. విశ్వసనీయ అంతర్జాతీయ కార్మిక భాగస్వామిగా భారత్‌ ఎదుగుతున్న తీరును ప్రముఖంగా ప్రస్తావించారుపారదర్శకనైతికవిస్తరించదగిన అంతర్జాతీయ శ్రామిక శక్తి బదిలీ మార్గాలను ఏర్పరించేందుకు భారత ప్రభుత్వ నిబద్ధతను ఆమె స్పష్టం చేశారుభారతదేశ జనాభా బలంబలమైన నైపుణ్య వ్యవస్థసంస్థాగత సంస్కరణలు.. జపాన్‌తో సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు నైపుణ్యం గల మానవ వనరులను అందించే విశ్వసనీయ దేశంగా భారత్‌ను నిలబెడుతున్నాయని స్పష్టం చేశారు.

ఉన్నత విద్యా సంస్థలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలుఅప్రెంటిస్‌షిప్ విధానాలుడిజిటల్ నైపుణ్య వేదికలుఉపాధి సేవల మద్దతుతో భారత్‌లో భారీ స్థాయిలో రూపుదిద్దుకున్న వర్క్‌ఫోర్స్ ప్రిపరేషన్ ఎకోసిస్టమ్‌ గురించి ఆమె వివరించారువిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇ-మైగ్రేట్‌ వేదికనేషనల్ కెరీర్ సర్వీస్ వేదికమోడల్ కెరీర్ సెంటర్లునైపుణ్యాభివృద్ధి-కార్మిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖరాష్ట్రాలువిద్యా సంస్థలతో విస్తృతమైన నైపుణ్య వ్యవస్థతో సహా భారతదేశ అంతర్జాతీయ కార్మిక వలసల వ్యవస్థ గురించి ఆమె ప్రస్తావించారు.

భారత్‌, జపాన్ దేశాల మధ్య జపనీస్ భాషా నైపుణ్యాన్ని పెంపొందించటంనిర్దిష్ట రంగానికి సంబంధించిన నైపుణ్యాల శిక్షణపరీక్షల మౌలిక సదుపాయాలునైపుణ్యాల మ్యాపింగ్వృత్తిపరమైన యోగ్యతక్రమబద్ధమైన డిమాండ్ సమీకరణనైతిక నియామక పద్ధతులుసంస్థాగత సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరముందని కార్యదర్శి స్పష్టం చేశారు.

జపాన్ ప్రధానమంత్రిగౌరవ అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మగౌహతి ఐఐటీ డైరెక్టర్ల నుంచి ప్రత్యేక సందేశాలు అందాయిఈ సందేశాల్లో భారత్‌-జపాన్‌ మధ్య మధ్యకాలికదీర్ఘకాలిక మానవ వనరుల మార్పిడికి సంబంధించి స్పష్టమైన భవిష్యత్‌ ప్రణాళికను వివరించారుఅంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగాప్రపంచ స్థాయి నైపుణ్యాలు గల శ్రామికులను తయారు చేయటంలో భారతదేశంలోని రాష్ట్రాలుఉన్నత విద్యా సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు.

భారత్‌లోని నైపుణ్యం గల శ్రామిక వ్యవస్థతో క్రమబద్ధమైన భాగస్వామ్యాన్ని అన్వేషిస్తున్న ప్రముఖ జపనీస్ కంపెనీల సీనియర్ అధికారులుమానవ వనరుల విభాగ మేనేజర్లతో సహా దాదాపు 250 మంది ప్రతినిధులు ఈ సెమినార్‌లో పాల్గొన్నారు.

తయారీ, సంరక్షణ సేవలునిర్మాణంఆటోమొబైల్ నిర్వహణఆతిథ్య రంగంవ్యవసాయంఐటీడిజిటల్ సేవలునూతనంగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ ఎకానమీ వంటి రంగాల్లో భారత్‌-జపాన్ మధ్య సహకారానికి బలమైన అవకాశాలున్నాయని ప్రతినిధులు గుర్తించారుపారదర్శకమైనవిస్తృతమైన ఉపాధి అవకాశాలను పెంపొందించటంలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలుఉపాధి కల్పన వ్యవస్థల ప్రాధాన్యతను ఈ చర్చలు స్పష్టం చేశాయి.

భవిష్యత్ కార్యాచరణలో భాగంగా భారతదేశంలో జపనీస్ భాషా శిక్షణ, పరీక్షా కేంద్రాల విస్తరణ.. జపనీస్ యజమానులుభారత నైపుణ్య శిక్షణా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయటంజపాన్‌లోని ఉపాధి డిమాండ్‌ను స్పష్టంగా గుర్తించటంనైపుణ్యాల గుర్తింపువృత్తిపరమైన యోగ్యతను పెంపొందించటంసన్నిహిత సంస్థాగత సహకారం ద్వారా విశ్వసనీయమైన శ్రామిక శక్తి బదిలీ మార్గాలను ఏర్పాటు చేయటం వంటి అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలకు ముఖ్యంగా జపాన్‌ వెళ్లే అభ్యర్థులను సిద్ధం చేయటానికి అస్సాం ప్రభుత్వం చేపట్టిన ఫారిన్ లాంగ్వేజ్ ఇనిషియేటివ్ ఫర్ గ్లోబల్ టాలెంట్ (ఫ్లైట్).. అద్భుతమైన రాష్ట్ర స‌్థాయి కార్యక్రమంగా నిలిచింది.

ఆసియాన్ గ్రూప్ కో. లిమిటెడ్ చైర్మన్సీఈఓ మిస్టర్ తోషియాకి నిషికావా ఉపన్యాసంతో ఈ కార్యక్రమం ముగిసిందిభారత్-జపాన్ ప్రజల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్య ప్రాముఖ్యతను ఆయన స్పష్టం చేశారుభవిష్యత్తులో శ్రామిక శక్తి సహకారంపై ఆశాభావం వ్యక్తం చేశారురాబోయే పదేళ్లలో 50,000 మందితో జపాన్-భారత్‌ పర్సనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంను సాకారం చేయటం పట్ల ఆయన ఆసక్తిని కనబరిచారు.

***


(రిలీజ్ ఐడి: 2265449) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil