గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖనిజ బ్లాకుల వేలం, నిర్వహణ పురోగతిని సమీక్షించిన కేంద్ర గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి

నాడు పోస్టు చేయడమైనది: 25 MAY 2026 5:45PM by PIB Hyderabad

కేంద్ర గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులుకేటగిరీ-ఎ ఖనిజ నిక్షేపాలు ఉన్న రాష్ట్రాల అధికారులతో తొమ్మిదో నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారుదేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలంవాటి నిర్వహణ పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారుగనుల రంగంలో సంస్కరణలను వేగవంతం చేయడందేశీయ ఖనిజ ఉత్పత్తిని పెంచడంవేలం వేసిన ఖనిజ బ్లాకులను సకాలంలో అందుబాటులోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

2015లో వేలం విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం 108 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలం వేయడాన్ని సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారుఆ తర్వాత వేలం ప్రక్రియ గణనీయమైన వేగాన్ని పుంజుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి  2024-25 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో ఏటా సగటున 90 బ్లాకుల చొప్పున మొత్తం 364 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలం వేశారు.

ఒక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో 212 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలం వేశారువేలం విధానం ప్రారంభమైనప్పటి నుంచి ఒకే ఆర్థిక సంవత్సరంలో ఇన్ని ఖనిజ బ్లాకులను వేలం వేయడం ఇదే మొదటిసారిఈ వేలంలో 22 కీలకమైనవ్యూహాత్మక ఖనిజ బ్లాకులు కూడా ఉండడం విశేషంభారత ఆర్థిక వృద్ధికిస్వచ్ఛ ఇంధన మార్పునకు అవసరమైన కీలక ఖనిజ వనరులను సమకూర్చుకోవడంపై ప్రభుత్వం నిరంతరం చూపుతున్న శ్రద్ధను ఇది ప్రతిబింబిస్తోంది.

వేలం వేసిన బ్లాకుల నిర్వహణ స్థితిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 20 గ్రీన్ ఫీల్డ్, 38 బ్రౌన్ ఫీల్డ్ బ్లాకులతో కలిపి మొత్తం 58 బ్లాకులు అందుబాటులోకి రాగాఒక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 28 గ్రీన్ ఫీల్డ్, 8 బ్రౌన్ ఫీల్డ్ బ్లాకులతో కలిపి మొత్తం 36 ఖనిజ బ్లాకులు నిర్వహణలోకి వచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

చట్టబద్ధమైన అనుమతులను వేగవంతం చేయడానికిగనుల తవ్వకాలను త్వరతిగతిన ప్రారంభించడానికివేలం వేసిన బ్లాకుల నుంచి సకాలంలో ఉత్పత్తిని సాధించడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహిత సమన్వయం అవసరమని గనుల శాఖ కార్యదర్శి స్పష్టం చేశారుఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలోనూభారత ఖనిజ భద్రతను బలోపేతం చేయడంలోనూ కీలక ఖనిజాల అభివృద్ధి ప్రాధాన్యతను కూడా ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు

***


(రిలీజ్ ఐడి: 2265228) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil